E-Paper
Advertisement

400 ఏళ్ల దెయ్యాల రాణితో క్రేజీ లవ్… రెండు క్లైమాక్స్ లతో ఆకట్టుకుంటున్న కే డ్రామా

400 ఏళ్ల దెయ్యాల రాణితో క్రేజీ లవ్… రెండు క్లైమాక్స్ లతో ఆకట్టుకుంటున్న కే డ్రామా
Advertisement

fantasy Romantic drama : ఓటీటీలో రీసెంట్ గా ఒక చైనీస్ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటోంది ఈ సిరీస్. ఇది ఒకరకమైన మాయా లోకం కథ. ఇందులో హీరో ఏమో పెద్ద యుద్ధ వీరుడు, హీరోయిన్ ఏమో వందల ఏళ్ల వయసున్న దెయ్యాల రాణి. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, ఆ ప్రేమ కోసం వాళ్లు ఎంతమందితో కొట్లాడారు అనేది మెయిన్ పాయింట్. మన సినిమాల్లో లాగా ఇందులో కూడా విలన్లు, వాళ్ల కుట్రలు, పెద్ద పెద్ద యుద్ధాలు అన్నీ ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఇది ఒక సెంటిమెంట్ ప్యాకేజీ. కేవలం ప్రేమ అని కాకుండా, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంత రేంజ్‌లో సీన్లు ఉంటాయి. ఆత్మలు, మంత్రాలు, తంత్రాలు లాంటివి నచ్చేవాళ్లకి ఈ సిరీస్ ఒక పండగలా అనిపిస్తుంది. అంతేకాదు దీనికి రెండు క్లైమాక్స్ లు కూడా ఉన్నాయి. అందుకే సిరీస్ కూడా క్రేజీగా ఉంటోంది.

ఎక్కడ చూడచ్చు అంటే 

ఈ చైనీస్ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా పేరు ‘లవ్ బియాండ్ ది గ్రేవ్’ (Love Beyond the Grave). ఇది 2026లో వచ్చిన 40 ఎపిసోడ్ ల డ్రామా. ఇందులో దిల్రాబా దిల్‌మురాత్ (హీ సిముగా), చెన్ ఫీయు (దువాన్ క్సుగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ లీ క్వింగ్రాన్ రాసిన ‘బాయి రీ తీ డెంగ్’ అనే ఫేమస్ నవల ఆధారంగా రూపొందించబడింది. దీనిని ప్రముఖ దర్శకుడు క్విన్ జెన్ తెరకెక్కించారు. ఈ డ్రామా కోసం చైనాలోని ఫేమస్ హెంగ్డియన్ వరల్డ్ స్టూడియోస్‌లో భారీ సెట్లు వేసి చిత్రీకరించారు. ముఖ్యంగా ఇందులోని విజువల్స్ అద్భుతంగా ఉంటాయని పేరు కూడా వచ్చింది. అలాగే ప్రధాన నటీనటులైన దిల్రాబా, చెన్ ఫీయు తమ పాత్రలకు తామే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఈ సిరీస్ కు ఉన్న ఒక ప్రత్యేకత. విడుదల కావడానికి ముందే ఈ సిరీస్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇది వికి (Viki) ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథలో హీరోయిన్ హీ సిము ఒక ఆత్మల రాణి. ఆమెకి దాదాపు 400 ఏళ్ల వయసు ఉంటుంది. ఒకరోజు ఆమె ఆహారం కోసం వెతుకుతుండగా, అనుకోకుండా సేనాపతి దువాన్ క్సుని కలుస్తుంది. ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దీనివల్ల వారిద్దరి “ఐదు జ్ఞానేంద్రియాలు” (చూపు, వినికిడి, స్పర్శ వంటివి) ఒకదానికొకటి ముడిపడిపోతాయి. అంటే ఒకరికి దెబ్బ తగిలితే ఆ నొప్పి ఇంకొకరికి తెలుస్తుంది, ఒకరు చూసేది ఇంకొకరు చూడగలరు. మొదట్లో ఒకరినొకరు ఇష్టపడకపోయినా, ఈ ఎఫ్ఫెక్ట్ వల్ల ఒకరి మనసులోని బాధను మరొకరు అర్థం చేసుకుంటారు. అలా వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. కానీ అసలు సమస్య ఏమిటంటే.. హీరోయిన్ ఒక ఆత్మ, ఆమెకు చావు లేదు. హీరో ఒక సాధారణ మనిషి, అతనికి ఏదో ఒకరోజు మరణం తప్పదు. దీనికి తోడు, అటు మానవ లోకంలోనూ, ఇటు ఆత్మల లోకంలోనూ కొందరు విలన్లు వీరిద్దరినీ విడదీయాలని, యుద్ధాలు సృష్టించాలని ప్లాన్ చేస్తారు.

అయితే వీరిద్దరూ కలిసి అన్ని అడ్డంకులను దాటుకుంటూ వస్తారు. చివరికి ఒక యుద్ధంలో హీరో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. తనకున్న శక్తులను, అమరత్వాన్ని వదులుకుని, ఒక సాధారణ మనిషిగా మారిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలా తన శక్తులతో హీరోని కాపాడుకుని, చివరికి తన ప్రియుడితో కలిసి జీవితాన్ని గడపడంతో కథ సుఖాంతమవుతుంది. అయితే ఈ సినిమాకి మరో క్లైమాక్స్ కూడా ఉంది. ఇది ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : హారర్ చిత్రాల చరిత్రను మార్చిన ఒక ప్లాస్టిక్ బొమ్మ… భయం పుట్టిస్తున్న ప్రాంఛైజీ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×