Gabbarsingh Ramesh :ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఇందులోని అంత్యాక్షరి సీన్ కి ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. అంతేకాదు ఈ సీన్ లో నటించిన ఎంతోమందికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అలా అంత్యాక్షరి సీన్లో ఒకరిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న నటుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్న వైద్యులు.. పరిస్థితి విషమం అంటూ తెలపడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆయన ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ రమేష్. గబ్బర్ సింగ్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అపోలో హాస్పిటల్ బృందం ఆయనను అత్యవసర వైద్య విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఆయన కోలుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాం అంటూ అపోలో వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, సాంకేతిక నిపుణులు , అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.ప్రస్తుతం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొనింది.
also read:బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజి వైద్యబృందం!
గబ్బర్ సింగ్ రమేష్ ఈ సినిమా తర్వాత చాలా చిత్రాలలో అవకాశాలు అందుకున్నారు. నటుడిగా, కమెడియన్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రెగ్యులర్గా ఏదో ఒక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు. కానీ గబ్బర్ సింగ్ రేంజ్ గుర్తింపు అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెట్టే ఈయన రెండు రోజుల క్రితమే.. తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షూటింగ్ లొకేషన్ నుంచి కూడా ఒక వీడియో షేర్ చేసుకున్నాడు. ఇక అలాంటి ఈయన ఇప్పుడు ఆకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో అపోలో హాస్పిటల్లో చేరడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==