E-Paper
Advertisement

Gaddar awards 2026: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి….!

Gaddar awards 2026: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి….!
Advertisement

Gaddar awards 2026:గద్దర్ అవార్డ్స్ 2026.. ఈ మధ్యనే ప్రకటించగా.. ఈరోజు ఉగాది సందర్భంగా.. సెలబ్రిటీలు అందరినీ పిలిచి ఆ అవార్డులు.. ఇచ్చే వేడుక.. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యంగా ఉగాది రోజున ఈ వేదుక జరుగుతూ ఉండడంతో.. సెలబ్రిటీల్లో అలానే.. అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉగాది రోజున నంది అవార్డులు ఇచ్చే సంప్రదాయం ఉండేదని గుర్తు చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారని తెలిపారు.

Advertisement

రాష్ట్ర విభజన తరువాత ఈ అవార్డుల పరంపర కొంతకాలం నిలిచిపోయిందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మురళీమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డ్స్ రూపంలో ఈ కార్యక్రమం తిరిగి రావడం సినీ రంగానికి మంచి సంకేతమని చెప్పారు.

Advertisement

ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అవార్డులను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సరం.. క్లియర్ చేయడం ప్రశంసనీయం అని అన్నారు. ఇది కళాకారులకు గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా, వారి కృషిని గుర్తించే మంచి ప్రయత్నమని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఇలాంటి అవార్డులు ఇవ్వడం ఒక పండగలా మారాలని ఆయన ఆశించారు. సినీ రంగానికి ఇది ఒక ప్రోత్సాహం అవుతుందని, కొత్త కళాకారులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు.

మొత్తం పైన.. గద్దర్ అవార్డ్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కళలకు ఇచ్చే ప్రాముఖ్యత మరోసారి స్పష్టమైంది. మురళీమోహన్ వ్యాఖ్యలు ఈ వేడుకకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఇకపై ప్రతి ఉగాది సందర్భంగా ఇలాంటి వేడుకలు జరుగుతూ సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని అందరూ ఆశిస్తున్నారు.

ALSO READ: Ustaad Bhagath Singh: మహేష్ బాబు పాటకు పవన్ కళ్యాణ్ స్టెప్పులు.. దుమ్ము రేపుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×