Mystery Thriller OTT : ఓటీటీలోకి ‘డెడ్‌లాక్’ (Deadloch) సీజన్ 2 వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో, సీజన్ 2 మరింత జోష్ తో వస్తోంది. మొదటి సీజన్ టాస్మానియా చలికి భిన్నంగా, ఈసారి కథ అంతా మండే వేసవిలో మొసళ్ళు, అడవుల మధ్య ఉత్కంఠభరితంగా సాగుతుంది. సీజన్ 1 కొత్త మిషన్ ముగిసిన కొన్ని నెలల తర్వాత, డెటెక్టివ్ డల్సీ, తన కొత్త కొలీగ్ ఎడ్డీతో కలిసి ఉత్తర ఆస్ట్రేలియాకు వెళ్తుంది. ఎడ్డీ తన పాత మిత్రుడి మరణం వెనుక ఉన్న మిస్టరీ ఛేదించడంలో ఈ కథ ఉంటుంది. చివరిగా వీళ్ళు ఒక భయంకరమైన క్రైమ్ నెట్‌వర్క్‌ను ఎలా అడ్డుకున్నారనేదే ఈ సీజన్ కథ.
‘డెడ్‌లాక్’ (Deadloch) సీజన్ 2 కథ ఆస్ట్రేలియాలోని డార్విన్, బార్రా క్రీక్ అనే ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సీజన్ మొత్తం 6 ఎపిసోడ్లలో ముగుస్తుంది. 2026 మార్చి 20న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సిరీస్ మొదట రెండు ఎపిసోడ్స్ తో అందుబాటులోకి వస్తోంది. తర్వాత ప్రతి శుక్రవారం ఒకటి వస్తుంది. ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డబ్బింగ్ అందుబాటులో ఉంటుంది. ఈసారి పాత వాళ్లతో పాటు కొంతమంది కొత్త నటులు కూడా తోడయ్యారు. ఇందులో కేట్ బాక్స్ (డల్సీ కొలిన్స్) మేడెలైన్ సామి (ఎడ్డీ రెడ్‌క్లిఫ్) డెటెక్టివ్ పాత్రల్లో నటించారు.
మొదటి పార్ట్ లో టాస్మానియా చలిలో హంతకులను ఉతికి ఆరేసిన డెటెక్టివ్ జోడి డల్సీ, ఎడ్డీలు.. ఈసారి డార్విన్ ఎండల్లో చెమటలు పట్టించే వేట మొదలుపెట్టారు. ఎడ్డీ పాత మిత్రుడు బుషీ చావు వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని పసిగట్టి, ఆ సీక్రెట్ కనిపెట్టడానికి ఈ ఇద్దరు లేడీ సింగంలు రంగంలోకి దిగారు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, అది మామూలు చావు కాదు, దాని వెనుక ఏదో పెద్ద స్కామ్ దాగుందని! సీన్ కట్ చేస్తే.. డార్విన్ అడవుల్లో మొసళ్ళ మధ్య ఒక మనిషి బాడీ పార్ట్ దొరకడంతో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఆ ఊర్లో మొసళ్ళను చూపిస్తూ పైసలు సంపాదించే టూరిజం మాఫియా, వాళ్ళ వెనుక ఉన్న పెద్ద తలకాయల గుట్టు రట్టు చేయడానికి మనోళ్లు దిగుతారు. అడుగు తీసి అడుగు వేస్తే మొసళ్లు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే జనాలు.. వీళ్ళ మధ్య డల్సీ తన తెలివితో, ఎడ్డీ తన రఫ్ అండ్ టఫ్ స్టైల్‌తో హంతకులను పట్టుకోవడానికి రెడీ అవుతారు. చివరికి ఆ మొసళ్ళ చెరువుల్లో దాగున్న రహస్యం ఏమిటి ? ఎడ్డీ బాయ్ ఫ్రెండ్ ను చంపింది ఎవరు ? డల్సీ, ఎడ్డీలు ఎలా ఈ కేసును డీల్ చేశారు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : చలి జ్వరం తెప్పించే చేతబడి … వణికించే క్షుద్రపూజలతో ప్యాంట్లు తడిపించే ఈ సినిమాలు ఎక్కడ చూడచ్చో తెలుసా ?