E-Paper
Advertisement

Gandhi Talks Trailer: మూకీ సినిమాగా ‘గాంధీ టాక్స్’.. ఒక్క డైలాగ్ లేకుండా ట్రైలర్ రిలీజ్

Gandhi Talks Trailer: మూకీ సినిమాగా ‘గాంధీ టాక్స్’.. ఒక్క డైలాగ్ లేకుండా ట్రైలర్ రిలీజ్
Advertisement

Gandhi Talks Trailer: విజయ్ సేతుపతి హీరోగా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న విజయ్ సేతుపతి మరో ప్రయోగాత్మక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్రధాన పాత్రలో గాంధీ టాక్స్ (Gandhi Talks) అనే మూకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జనవరి 30వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అందరిని ఆకట్టుకుంటుంది.

మాటలు లేకుండా గాంధీ టాక్స్..

ఈ ట్రైలర్ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం బిజీఎంతో మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి కూడా విభిన్న రీతిలో స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమాకు కిషోర్ కి బేలేకర్ దర్శకత్వం వహించగా, విజయ్ సేతుపతి అతిథి రావు హైదరి హీరో హీరోయిన్లుగా నటించారు ఇక సీనియర్ నటుడు అరవిందస్వామి(Aravind Swamy) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదలవుతుందంటే పవర్ ఫుల్ డైలాగులు అద్భుతమైన పాటలు వంటివి ఉండాలి కానీ ఈ సినిమా మాత్రం మాటలు లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రతి కథకు మాటలు అవసరం లేదు..

Advertisement

ఈ ట్రైలర్ వీడియోని విడుదల చేస్తూ.. ప్రతి కథకు మాటలు అవసరం లేదు కానీ చూడటంతోనే మనసును హత్తుకుంటాయి. ఈసారి స్క్రీన్ పై మాటలు లేకుండా కేవలం వినేలా మాత్రమే చేస్తుంది అంటూ చిత్ర బృందం ఈ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమా మొత్తం మాటలు లేకుండా కేవలం వారి హావభావాలతోనే సినిమా కథను మొత్తం ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు. ఇలా మాటలు లేని ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

విజయ్ సేతుపతి సరికొత్త ప్రయోగం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది, విజయ్ సేతుపతికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. జనవరి 30వ తేదీ ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ సేతుపతి తమిళ హీరో అయినప్పటికీ ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే తెలుగులో కూడా ఈయన సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అరవింద స్వామి కూడా నటించడంతో సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి.. మూకీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని సక్సెస్ అయితే మాత్రం ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు మరిన్ని ప్రేక్షకుల ముందుకు వస్తాయనే చెప్పాలి.

Also Read: Irumudi Movie: రవితేజ ఇరుముడి రీమేక్ సినిమానా.. మళ్లీ రిస్క్ చేస్తున్నారా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×