Garividi Lakshmi On RP Patnaik: గరివిడి లక్ష్మి ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన పేరు. ఉత్తరాంధ్రలో బుర్రకథల కళాకారిణిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గరివిడి లక్ష్మి(Garividi Lakshmi) బుర్రకథలతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇటీవల కాలంలో బుర్రకథలు అంతరించిపోతున్న నేపథ్యంలో అందరికీ బుర్రకథల ప్రాధాన్యత తెలియాలన్న ఉద్దేశంతో బుర్రకథల కళాకారిణి గరివిడి లక్ష్మి బయోపిక్ సినిమా(Garividi Lakshmi Biopic) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతే తెలిసిందే. ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది.
గరివిడి లక్ష్మి బయోపిక్ సినిమాలో నటి ఆనంది నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో గరివిడి లక్ష్మి కూడా పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ (R.P.Patnaik)గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్పి పట్నాయక్ తనని నమ్మించి మోసం చేశారంటూ గరివిడి లక్ష్మి తెలియజేశారు. ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాను రాను అంటుందే చిన్నదో అనే పాట అలాగే గాజువాక పిల్లా మేం గాజులోలం కాదా అనే పాటలు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ రెండు పాటలు కూడా తనవేనని గరివిడి లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రెండు పాటలు నావే అయితే ఆర్పి పట్నాయక్ గారు ఈ పాటలు తీసుకొని తనని మోసం చేశారని తెలిపారు. అప్పట్లో తనకు ఈ పాటల గురించి పెద్దగా అవగాహన లేదు అయితే ఆర్పి పట్నాయక్ గారు తన వద్దకు వచ్చి ఈ పాటలు సినిమా కోసం ఉపయోగిస్తున్నామని అయితే సినిమాలో ఈ పాటలు తన చేతి పాడిస్తానని చెప్పారు. ఇలా పట్నాయక్ గారు మాట ఇచ్చి మాట తప్పారని గరివిడి లక్ష్మి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ పాటల సమయంలో తనకు ఎలాంటి డబ్బు కూడా ఇవ్వలేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.
నా పాటలు సినిమాలో వస్తున్నాయి అంటే తనకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఇచ్చాను తప్ప డబ్బును ఆశించి కాదని గరివిడి లక్ష్మి తెలిపారు. ఇలా తనకు పేరు వస్తుందని తన పాటలను ఇచ్చినప్పటికీ కనీసం తన చేత పాటలు కూడా పాడించలేదని అలాగే తన పేరును కూడా ఎక్కడ స్క్రీన్ మీద వేయలేదని తెలిపారు. ఇక ఈ పాటలు మీరు ఇచ్చిన సమయంలో ఎలాంటి అగ్రిమెంట్ కూడా రాసుకోలేదా అనే ప్రశ్న ఎదురవడంతో తనకు ఇలాంటి వాటి గురించి అవగాహన లేదు అందుకే ఏ విధమైనటువంటి అగ్రిమెంట్స్ కూడా రాయలేదని గరివిడి లక్ష్మి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఆర్పి పట్నాయక్ గురించి గరివిడి లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఆర్పి పట్నాయక్ స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఆదర్శ కుటుంబం సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా టికెట్ ధరలు పెంపు!