E-Paper
Advertisement

రాష్ట్రం నీటి సంక్షోభంలో ఉంటే.. ఢిల్లీ బాటపడతారా? కాంగ్రెస్ నిరసనలపై రాంచందర్ రావు ఫైర్!

రాష్ట్రం నీటి సంక్షోభంలో ఉంటే.. ఢిల్లీ బాటపడతారా? కాంగ్రెస్ నిరసనలపై రాంచందర్ రావు ఫైర్!
Advertisement

Ramchander Rao: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 600కు పైగా మండలాల్లో దాదాపు 330 మండలాలు వర్షాభావం, కరువుతో అల్లాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 6 వేల చెరువులు ఉంటే కేవలం 500 చెరువుల్లో మాత్రమే నీరు నిలిచి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరంలోనే రోజుకు సుమారు 8 వేల వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని గుర్తుచేశారు. ప్రజలు ఇంతటి నీటి సంక్షోభాన్ని, కష్టాలను ఎదుర్కొంటుంటే కాంగ్రెస్ నేతలు వాటిని పరిష్కరించడం మానేసి, బాధ్యతను గాలికి వదిలేసి రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ బాట పట్టడం క్షమించరాని నేరమన్నారు.

నాంపల్లి బీజేపీ రాస్​ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌పై ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న ర్యాలీ పేరుతో వెళ్తామంటూ చెబుతున్న రేవంత్ రెడ్డి తీరు.. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఉందని మండిపడ్డారు. ప్రజలను అసత్యాలతో నమ్మించలేక, నిరాశానిస్పృహలతో ప్రధాని మోడీ తల్లి, తండ్రులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుతున్న అనుచిత భాష, దిగజారుడు పదజాలం ఆ పార్టీ దౌర్భాగ్యకరమైన స్థితికి అద్దం పడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Also Read: పేపర్ స్ట్రా లు నిజంగా మంచివేనా.. దక్షిణ కొరియా అధ్యయనంలో తేలిన సంచలనాలివే?

మరోవైపు ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా ముగింపు దశకు చేరినా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలను ఆపడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి జోకులు వేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి సమాజంలో, దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. ఈ అరాచక వైఖరిని ఎండగట్టేందుకు ‘లోక్‌తంత్ర బచావో-సేవ్ డెమోక్రసీ’, ‘అరాచకత హఠావో-రిమూవ్ అనార్కీ’ నినాదాలతో నవంబర్ 2వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొని నడుస్తారని రాంచందర్ రావు వెల్లడించారు.

Advertisement

Also Read: భారత్‌లో మారిన బంగారం దిగుమతుల మ్యాప్.. జోరందుకున్న దుబాయ్ రూట్!

Tags

Related News

బోడుప్పల్‌లో ఫేక్ డాక్టర్ల దందాకు చెక్.. రిజిస్ట్రేషన్ లేని మమత క్లినిక్ సీజ్!

ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి!

తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన బీజేపీ నేతలు!

ఇంటిపై యూట్యూబ్ లోగో వేయించుకొని.. లక్షల్లో సంపాదిస్తున్న యువత!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. బల్మూరి వెంకట్ సంచలనం!

ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

Big Stories

Advertisement
×