E-Paper
Advertisement

బిల్డప్ ఇంటర్నేషనల్.. కండీషన్స్ లోకల్.. అశ్వారావుపేటలో ప్రైవేట్ స్కూల్స్ దందా..!

బిల్డప్ ఇంటర్నేషనల్.. కండీషన్స్ లోకల్.. అశ్వారావుపేటలో ప్రైవేట్ స్కూల్స్ దందా..!
Advertisement

School Fees: స్వేచ్ఛ బ్యూరో: 2026 నూతన విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే ప్రైవేట్ విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సిద్ధత చదువుపై కంటే ఫీజులపై ఎక్కువగా కేంద్రీకృతమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముందుగానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పెంచబోయే స్కూల్ ఫీజుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికీ ఛార్జీలు జోడిస్తూ తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అడ్మిన్ ఫీజు, పరీక్ష ఫీజులు, బస్సు ఫీజు, షూస్ ఫీ, యూనిఫామ్ ఫీ, బుక్స్ ఫీ, ట్యూషన్ ఫీ, డాన్స్ ఫీ ఇలా కాదేది అనర్హం అన్నట్లు ఫీజుల జాబితా తయారీ కొనసాగుతోంది.

నరక యాతన..

ఈ పెరుగుతున్న ఖర్చులు తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతుండగా, పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆశలను అవకాశంగా మలుచుకుంటున్న కొంతమంది విద్యా వ్యాపారాలు విమర్శలకు గురవుతున్నాయి.పోయిన సంవత్సరం కొద్దిగా రిజల్ట్స్ రావడంతో ప్రైవేట్ పాఠశాలలు స్కూల్ ఫీజులు పెంచినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పిల్లలను రోబోలలా తయారు చేస్తే వారి భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక నరక యాతన అనుభవిస్తున్న విద్యార్థులు ఉన్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు చిన్న వయస్సు నుంచే ఒత్తిడి పెంచుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను నరక కూపాల్లోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆవేదన వ్యక్తం..

Advertisement

కొద్దో గొప్పో మిగతా పాఠశాలల్లో ఫీజులు తక్కువగా ఉన్నప్పటికీ, ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో బిల్డప్స్ ఇవ్వడం మాత్రం అశ్వారావుపేటలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌కే చెల్లిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.స్కూల్ గేట్లు తెరుచుకునే సరికి తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ఒకప్పుడు విద్య సేవగా భావించబడితే, ఇప్పుడు అది పూర్తిస్థాయి వ్యాపారంగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. సిలబస్ కంటే ఫీజుల పట్టికే పెద్దదిగా కనిపిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“రండి బాబు రండి” అన్నట్లుగా ప్రచారాలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్న యాజమాన్యాలు, అదే సమయంలో భారీ ఫీజులతో కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శక విధానాలు అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Also read: త్వరలో కొత్త పథకాల అమలుకు శ్రీకారం: మంత్రి కోమటి రెడ్డి..!

2026 సంవత్సరంలో..

Advertisement

విద్య అందరికీ అందుబాటులో ఉండాలే గానీ భారం కాకూడదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.చదువు వెలుగు చూపాల్సిన చోట ఫీజుల భారంతో చీకటి కమ్ముకుంటోందా అనే ప్రశ్న సమాజం ముందుంది. ఇదిలా ఉండగా, 2026 సంవత్సరంలో అశ్వారావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలు మంచి ప్రతిభ కనబరిచాయి. మైనారిటీ స్కూల్స్, ఏజీహెచ్‌ఎస్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాయి. మామిళ్లవారిగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు కూడా అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభుత్వ పాఠశాలల పేరును మారుమోగేలా చేశారు. ఆటల్లోను, చదువుల్లోను పోటీ తత్వం పెరిగి విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తున్నట్లు ఫలితాలు తెలుపుతున్నాయి.

అధికారుల తనిఖీలు..

ఇది ఇలా ఉండగా, తనిఖీలు అన్ని ప్రభుత్వ పాఠశాలలకేనా, ప్రైవేట్ స్కూల్స్‌కు ఉండవా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కాలం చెల్లిన వాహనాలు, సౌకర్యాల లేమి, టీచర్లకు అరకొర జీతాలు వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నెలకు రూ.10,000లోపే వేతనం ఇచ్చి, అది కూడా సమయానికి ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇకనైనా 2026 విద్యా సంవత్సరంనుంచి జిల్లా, మండల అధికారులు తనిఖీలు చేపట్టి ప్రైవేట్ పాఠశాలలపై నిఘా పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను విడిచిపెట్టి, తమ పిల్లలను అక్కడ చేర్పించి మంచి విద్య అందించేందుకు ముందుకు రావాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

Also read: తహసిల్ధార్లకే షాక్.. అయిజలో‌ నకిలీ ధ్రువపత్రాల గుట్టు రట్టు..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×