E-Paper
Advertisement

Girija Oak: ఒక్క ఇంటర్య్వూతో సెన్సేషన్‌.. నీ రేటేంత? అని అడుగుతున్నారు.. నటి ఆవేదన

Girija Oak: ఒక్క ఇంటర్య్వూతో సెన్సేషన్‌.. నీ రేటేంత? అని అడుగుతున్నారు.. నటి ఆవేదన
Advertisement

Girija Oak Received Negative Comments: ఏ సెలబ్రిటీకి అయిన పాపులారిటీ పెరిగిందంటే వారి కెరీర్‌ మలుపు తిరిగింది. వెంట వెంటనే ఆఫర్లూ క్యూ కడతాయి. దీనికి ప్రత్యేక ఉదాహరణ కుంభమేళ వైరల్‌ గర్ల్‌ మోనాలిసా. పూసలు అమ్ముకునే ఈ అమ్మాయిని సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ చేశారు. ఇంకేముంది సినిమా ఆఫర్‌ ఆమెనే వెతుక్కుంటూ వెళ్లింది. ప్రస్తుతం హిందీలో ప్రైవేట్‌ ఆల్బం సాంగ్స్‌, చిన్న చిన్న సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇదే తెలుగులో అశు రెడ్డికి కూడా ఒక్కసారిగా ఆఫర్స్‌ వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఎందరో ఒవర్‌ నైట్‌ స్టార్స్‌ అయిపోయారు. కానీ, ఈ స్టార్‌ నటికి పాపులారిటీ శాపమైందట.

ఒక్క వీడియో సెన్సేషన్

Advertisement

ఒక్క ఇంటర్య్వూతో సెన్సేషన్‌ అయిన ఆమెకు ఆఫర్స్‌ వస్తాయని ఎంతో ఆశపడింది. కానీ, సినిమా అవకాశాలకు బదులు సోషల్‌ మీడియాలో నుంచి అవమానం ఎదురువుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నటి గిరిజ ఓక్. ఆమె ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు అవుతుంది. కానీ, ఈ రెండు దశాబ్దాలుగా రానీ ఫేం, ఫాలోయింగ్‌ ఒక్క ఇంటర్య్వూతో వచ్చింది. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ వీడియోలు వైరల్‌ అవ్వడంతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ పెరిగింది. ఆమె వీడియోలు, ఆమె పేరుతో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ఇది చూసి ఆమె షాక్‌ అయ్యింది. ఈ రీతిలో వైరల్‌ అవుతానని తాను కూడా ఊహించలేదట. మరాఠి నటి గిరిజ ఓక్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో ట్రెండ్

దాంతో ఆమెకు ఒక్కసారిగా ఫాలోవర్లు పెరిగారు. లేటు వయసులో ఈ స్థాయిలో ట్రెండ్‌ అవ్వడం చూసి గిరిజ కూడా షాక్ అయ్యింది. ఈ రేంజ్‌లో తాను వైరల్‌ అవ్వడం ఇక కెరీర్ పరంగా కలిసి వస్తుందని ఆశపడ్డానని చెప్పింది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు వచ్చిన పాపులారిటీపై స్పందించింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తను పేరు ట్రెండ్‌ అవ్వడంతో కెరీర్‌ పరంగా మంచి అవకాశాలు వస్తాని ఎదురుచూశాను. కానీ, రియాలిటీలో అదేమీ జరగలేదు. 20 ఏళ్ల కెరీర్‌లో రాని పేరుతో ఒక్క రాత్రికి చూశాను. కానీ, అవకాశాలైతే రావడం లేదు. ఈ పాపులారిటీ వల్ల నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. నాకం ఎక్స్‌ట్రా సినిమా ఆఫర్లు రాకపోగా పైనుంచి పైగా నెగెటివ్‌ కామెంట్లు చాలా వస్తున్నాయి.

Advertisement

Also Read: Actor Shivaji: రాజమౌళిని అనడం కాదు.. దమ్ముంటే ఆ పని చేయండి, శివాజీ షాకింగ్ కామెంట్స్

నీ రేటేంత  అని అడుగుతున్నారు?

నెటిజన్ల కామెంట్స్‌ని ఉద్దేశిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. “సోషల్‌ మీడియా వేదికగా నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపడానికి ఎంత తీసుకుంటావు అంటూ అసభ్యకరంగా అడుగుతున్నారు. ఈ నీచపు సందేశాలకు లెక్కే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎదురైతే గౌరవంతో మాట్లాడతారేమో. కానీ, ఆన్‌లైన్ చాటున మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని గిరిజ అసహనం వ్యక్తం చేసింది. 2004లో ‘మానిని’ అనే మరాఠీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపట్టిన ఆమె ‘తారే జమీన్ పర్’, ‘జవాన్’, ‘ద వ్యాక్సిన్ వార్’ వంటి హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. అలా హిందీ, మరాఠీ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆమె సోషల్ మీడియాలో వచ్చే గుర్తింపు కేవలం ఫాలోవర్ల సంఖ్యకే పరిమితం అవుతుంది తప్ప, వృత్తిపరంగా అది పెద్దగా ఉపయోగపడదని అభిప్రాయ పడింది.

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×