E-Paper
Advertisement

Amardeep Chowdary: ఒక్క ఛాన్స్.. నన్ను ట్రోల్ చేయండి.. అమర్ దీప్‌‌‌‌ మాటలు వింటే జాలేస్తుంది

Amardeep Chowdary: ఒక్క ఛాన్స్.. నన్ను ట్రోల్ చేయండి.. అమర్ దీప్‌‌‌‌ మాటలు వింటే జాలేస్తుంది
Advertisement

Amardeep Chowdary: బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ చౌదరి ఇప్పుడు తన కొత్త సినిమా సుమతి శతకంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఒక ఇంజినీరింగ్ కాలేజీలో జరగగా.. అక్కడ అమర్ దీప్ చేసిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి.

అమర్దీప్ మాట్లాడుతూ “ఒక్క ఛాన్స్… ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అని పదే పదే కోరడం అందరి మనసులను తాకింది. తన జీవితం చిన్న స్థాయి నుంచి ఎలా మొదలైందో, అనంతపురం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఒక సాధారణ ఇంజినీరింగ్ విద్యార్థినేనని..అందుకే కాలేజీ స్టూడెంట్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు.

Advertisement

“థాంక్యూ… థాంక్యూ. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈరోజు శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా అనంతపురం నుంచి వచ్చినవాడినే. చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేశాను. రామ అనే పేరుతో మీ అందరి ప్రేమను పొందాను. ఇప్పుడు సుమతి శతకం సినిమా ద్వారా కృష్ణగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సినిమా చూసి నచ్చకపోతే..ఆ తర్వాత ట్రోల్ చేయండి..మాట్లాడండి. కానీ తప్పకుండా చూడండి. చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేశాను. ఇది నా ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. మీలో ఎవ్వరినీ డిసప్పాయింట్ చేయను. ఒక్క ఛాన్స్ రా… ఒకే ఒక్క ఛాన్స్,” అని చెప్పకు వచ్చారు.

Advertisement

సుమతి శతకం సినిమా గురించి మాట్లాడుతూ, ఇది కేవలం ట్రైలర్‌లో చూపించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ట్రైలర్‌లో మీరు చూసింది కేవలం 70 శాతం మాత్రమే.. మిగిలిన మంచి విషయాలు సినిమాల్లో దాచామని చెప్పారు. కామెడీ, ఎమోషన్, ఫైట్‌లు, పాటలు అన్నీ కలిసిన పూర్తి వినోదాత్మక సినిమా ఇది అని చెప్పారు. అలాగే ఇందులో ఒక డివైన్ టచ్, థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుందని తెలిపారు.

తనపై ట్రోల్స్ చేసినా పరవాలేదని, కానీ సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలని ఆయన కోరారు. “ఈ సినిమా తర్వాత కూడా నేను మళ్లీ వచ్చి ఒక్క ఛాన్స్ అడగను. ఇదే నా సినిమా, ఇదే నా కష్టం” అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తాను చేసిన కష్టమే తన సంపాదన అని, సుమతి శతకం తన జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పారు.

చివరిగా..స్టూడెంట్స్‌నే ఈ ట్రైలర్ లాంచ్‌కు అసలైన గెస్టులు, సెలబ్రిటీలు అంటూ వారిపై ప్రేమ చూపించారు. సినిమా చూసి తప్పకుండా స్టేటస్ పెట్టాలని, సపోర్ట్ చేయాలని కోరారు.

ALSO READ: Tollywood Actress: లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న బ్యూటీ.. ఊహించని షాక్ ఇచ్చిన పేరెంట్స్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×