Globe Trotter Event: గ్లోబ్ ట్రాటర్ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీ రామోజీ ఫిలిం సిటీలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి(Rajamouli) మహేష్ బాబు(Mahesh Babu) సినిమాకి సంబంధించిన వారణాసి(Varanasi) అనే టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమం కేవలం జియో హాట్ స్టార్ లో మాత్రమే లైవ్ ప్రసారం అయింది. ఈ కార్యక్రమ ప్రసార హక్కులను జియో హాట్ స్టార్ కొనుగోలు చేయడంతో ఈ ఓటీటీలో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అయింది. ఇకపోతే ఈ కార్యక్రమం యూట్యూబ్ లో కూడా అనంతరం ప్రసారమైన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) వేడుకను టెలివిజన్లో కూడా ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇక ఈ కార్యక్రమం ఈ ఆదివారం అనగా నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఈటీవీ తెలుగు చానల్లో ప్రసారం కానున్నట్లు వారణాసి టీం అధికారికంగా వెల్లడించారు. ఇలా గ్లోబ్ ట్రాటర్ టెలివిజన్ లో కూడా ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చూడటం మిస్సయిన వారు ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాజమౌళి విజన్ పై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలను ప్రమోషన్ చేయడంలో రాజమౌళి తర్వాతనే ఎవరైనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు ఒక చిన్న పోస్టర్ ద్వారా సినిమా టైటిల్ విడుదల చేసేవారు కానీ రాజమౌళి మాత్రం కోట్లు ఖర్చు చేసి పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహిస్తూ ఏకంగా గ్లోబల్ మీడియా దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఈ సినిమాకి భారీగా హైప్ పెంచేశారు. ఇక ఈవెంట్ గురించి పెద్ద ఎత్తున మీడియాలో కూడా వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం అనంతరం వారం వ్యవధిలోగా యూట్యూబ్లో ఈ వెంట్ కి సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఇక తాజాగా టెలివిజన్లో కూడా ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు భారీగా ప్రమోషన్ లభించిందని అభిమానులు భావిస్తున్నారు.
వారణాసిలో మహేష్ మేనల్లుడు..
కేవలం టైటిల్ రివీల్ కోసమే ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి తదుపరి ట్రైలర్, టీజర్ వంటి వాటి కోసం మరింత గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రకు సంబంధించిన షూటింగ్ సన్ని వేషాలు జరుగుతున్నట్టు సమాచారం. మహేష్ చిన్నప్పటి పాత్రలో తన మేనల్లుడు దర్శన్ నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా భాగమైన సంగతి తెలిసిందే.
Also Read: Thalaivar 173: రజినీకాంత్ తలైవార్ 173 అప్డేట్.. రంగంలోకి లేడీ పవర్ స్టార్!