Thalaivar 173: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikant)మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Hassan)నిర్మాణంలో ఇటీవల సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తలైవార్ 173(Thalaivar 173) పేరుతో షూటింగ్ పనులను జరుపుకోనుంది. ఈ సినిమాకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని షూటింగ్ పనులు ప్రారంభించాల్సిందే ఆలస్యం అనుకున్న తరుణంలో సినిమా నుంచి దర్శకుడు సుందర్ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త డైరెక్టర్ కోసం నిర్మాతలు వేట మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…
ఈ సినిమా కోసం పార్కింగ్ సినిమా దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్(Ram Kumar Balakrishnan) దర్శకుడిగా ఎంపిక అయినట్లు వార్తలు వచ్చాయి. ఈయన చెప్పిన కథ రజనీకాంత్ కు చాలా బాగా నచ్చడంతో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఇలా రామ్ కుమార్ బాలకృష్ణన్ ఈ సినిమాకు ఎంపిక కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) కూడా భాగం కాబోతున్నారన్న వార్తలు అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తెగ వైరల్ అవుతుంది.
సాయి పల్లవి నటుడు కతిర్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో నటించబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం. ఈ సినిమాకి ఎప్పటిలాగే అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)సంగీతం అందించనున్నారు. పూర్తి విభిన్నమైన కథాంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారు అంటూ వార్తలు బయటకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి సాధారణంగా ఒక సినిమాకు కమిట్ అయ్యారు అంటే కథ ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో నటించడానికి అంగీకారం తెలుపుతారు.
సీతగా సాయి పల్లవి..
ఇక రజనీకాంత్ సినిమాలో కూడా ఈమె నటించబోతున్నారని విషయం తెలియడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే పెరిగిపోయాయి. మరి ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించే వరకు ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలో షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈమె బాలీవుడ్ రామాయణ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు . ఈ సినిమాతో పాటు తమిళ సినిమాలకు కూడా కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ధనుష్ తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఇక తెలుగులో సాయి పల్లవి చివరిగా నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Keerthy Suresh: ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ.. మా సినిమా ఎవరు చూడరు