E-Paper
Advertisement

Globe Trotter: ఓవర్సీస్ లోనూ గ్లోబ్ ట్రాటర్ లైవ్ స్ట్రీమ్..ఎక్కడ చూడొచ్చంటే!

Globe Trotter: ఓవర్సీస్ లోనూ గ్లోబ్ ట్రాటర్ లైవ్ స్ట్రీమ్..ఎక్కడ చూడొచ్చంటే!
Advertisement

Globe Trotter: ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu)కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే నవంబర్ 15వ తేదీ ఈ సినిమాకు సంబంధించి గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కడ జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమా టైటిల్ అలాగే ఒక వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వెరైటీ యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం..

ఇలా ఈ వేడుకపై యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాని ఇండియాలో ఏ విధమైనటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా జియో హాట్ స్టార్(Jio Hotstar) లో చూసే వెసులుబాటును కల్పించారు. అయితే ఓవర్సీస్ లో ఉన్న అభిమానులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ తెలియజేశారు ఓవర్సీస్ లో ఉన్నవారు కూడా ఆన్లైన్ ద్వారా ఈ వేడుకను లైవ్ లో చూసే వెసులుబాటు కల్పించారు. విదేశాలలో ఉన్న వారు ఈ వేడుకను వెరైటీ యూట్యూబ్ ఛానెల్‌(variety youtube channel )లో చూసే అవకాశాన్ని కల్పించారు తాజాగా ఈ విషయాన్ని వెరైటీ యూట్యూబ్ ఛానల్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఖుషీ అవుతున్న ఓవర్సీస్ ఫ్యాన్స్..

Advertisement

ఈ గ్రాండ్ ఈవెంట్ నవంబర్ 15, 2025న హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇండియాలో, జియో హాట్‌స్టార్‌లో సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. అలాగే నవంబర్ 15న ఉదయం 5:30 PST / ఉదయం 8:30 ESTకి ప్రపంచవ్యాప్తంగా వెరైటీ యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కాబోతుందని వెల్లడించడంతో ఓవర్సీస్ లో ఉన్న తెలుగు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియ చేస్తూ.. ఓవర్సీస్ అబ్బాయిలు.. అమ్మాయిలు హ్యాపీయేనా అంటూ షేర్ చేశారు.

Advertisement

ఈ గ్రాండ్ ఈవెంట్ ను ఆన్లైన్ ద్వారా చూస్తే వెసులుబాటు కల్పించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నారు. స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. ఇక మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఈ కార్యక్రమంలోనే విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: Daggubati Family: దగ్గుబాటి కుటుంబం పై కోర్టు సీరియస్.. చర్యలు తప్పవంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×