Daggubati Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దగ్గుబాటి కుటుంబం(Daggubati Family) ఒకటి. ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా సురేష్ బాబు వెంకటేష్ వంటి తదితరులు హీరోలుగా నిర్మాతలుగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా దగ్గుబాటి కుటుంబం దక్కన్ కిచెన్ (Deccan Kitchen)హోటల్స్ విషయంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. దక్కన్ కిచెన్ లీజు విషయంలో హోటల్ యజమాని అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ మద్యం భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో హోటల్ యజమాని కోర్టును ఆశ్రయించారు.
ఇలా లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి దగ్గుబాటి కుటుంబం ఆ బిల్డింగ్ కూల్చివేశారన్న నేపథ్యంలో వీరిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోర్టుకు హాజరు కావాలి అంటూ దగ్గుబాటి కుటుంబానికి ఇప్పటికే ఎన్నో సందర్భాలలో నోటీసులు అందినప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కోర్టుకు హాజరు కాకుండా ఉన్నారు. అయితే పర్సనల్ బాండ్ సమర్పించడం కోసం నవంబర్ 14వ తేదీ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఇలా నేడు కూడా కోర్ట్ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు నేడు దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు కనుక హాజరు కాకపోతే సురేష్ బాబు, వెంకటేష్, రాణా, అభిరామ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే మూడుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించిన దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరు కావడానికి మరోసారి సమయం కావాలని కోరడంతో కోర్టు తీర్పు పై ఉత్కంఠత నెలకొంది. అయితే దగ్గుబాటి హీరోలందరూ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే హాజరు కాలేకపోతున్నట్లు గతంలో వెల్లడించారు. మరి కోర్టు సీరియస్ కావడంతో ఇప్పటికైనా విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
సినిమా పనులలో బిజీగా దగ్గుబాటి హీరోలు..
దగ్గుబాటి హీరోల విషయానికి వస్తే ప్రస్తుతం సురేష్ బాబు పలు నిర్మాణ పనులలో బిజీగా ఉండగా రానా కూడా ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వెంకటేష్ ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టు కొట్టిన వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Dhruv Vikram: ధృవ్ విక్రమ్ పేరుతో మోసం.. అలర్ట్ చేసిన నటుడు.. ఏం జరిగిందంటే?