E-Paper
Advertisement

Sudigali Sudheer : నిర్మాతల గురించి ఆలోచించు… సుడిగాలి సుధీర్‌కి డైరెక్ట్ కౌంటర్?

Sudigali Sudheer : నిర్మాతల గురించి ఆలోచించు… సుడిగాలి సుధీర్‌కి డైరెక్ట్ కౌంటర్?
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ చాలా మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ అనే కామెడీ షోతో పాపులర్ అయిన సుధీర్‌కు ఓ హీరోకు ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే.. ఆయన హీరో అయ్యాడు. ఫలితాలు ఎలా ఉన్నా… వరుసగా అయితే సినిమాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు హైలెస్సా అనే సినిమా చేస్తున్నాడు. దీని కంటే ముందు… గోట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి… ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది.

ఈ గోట్ సినిమాను 2023లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2026 వచ్చింది. మూడేళ్ల పాటు చేయాల్సినంత పెద్ద సినిమేం కాదు ఇది. అయినా.. ఎందుకు లేట్ అయిందంటే… కారణం దీనికి డైరెక్టర్‌గా పని చేసిన నరేష్ కుప్పిలి వైపు వేళ్లు చూపిస్తారు మూవీ యూనిట్… నిర్మాతలు.

Advertisement

ఇవి అన్ని పక్కన పెడితే.. 2026 న్యూ ఇయర్ సందర్భంగా నిర్మాతలు విష్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. విషింగ్ పోస్టర్ నార్మలే.. కానీ, అందులో ఉన్న టాపిక్ మాత్రం… ఆ గోట్ మూవీ హీరో సుడిగాలి సుధీర్‌ కోసమే రాసినట్టు ఉందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సుధీర్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేలా ఉందని అంటున్నారు.

అంతలా ఆ పోస్టర్ లో ఏం ఉందంటే… జనరల్ టాపిక్ చెబుతున్నట్టు సీనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పారు. నిర్మాతలు కష్టాల్లో ఉంటే అండగా నిలిచే హీరో ఎన్టీఆర్ అని… ఆయన కీర్తి కోసమో.. తన కంఫట్స్ కోసమో సినిమాలు చేయలేదని… సినిమాను, నిర్మాతను కాపాడే విధంగా సినిమాలు చేశాడు అని రాశారు. నిర్మాతలకు ఫైనాన్సియల్ ఇబ్బందులు ఉంటే.. హీరో రాత్రులు కూడా పని చేసేవాడని, సరైన టైంకి సినిమా పూర్తి అయ్యేలా కృషి చేసే వాడని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇప్పుడు దీని గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే.. గోట్ సినిమాను డైరెక్టర్ లేకుండానే నిర్మాత షూటింగ్ పూర్తి అయితే చేశాడు. కానీ, ఇప్పుడు హీరో సుడిగాలి సుధీర్ మాత్రం ప్రమోషన్స్ కి రావడం లేదు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో హీరో పాత్రకు అసలు డబ్బింగే చెప్పలేదు. అంటే.. సుధీర్ తన పాత్రకు కనీసం డబ్బింగ్ చెప్పడానికి కూడా రెడీ లేడా అనే మాటలు ఇండస్ట్రీలో వినిపించాయి.

ఇలాంటివి నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు కాబట్టే… న్యూ ఇయర్ విషెస్ పోస్టర్ లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ… తమ బాధను వెల్లడిస్తూ… సుడిగాలి సుధీర్‌కు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

ఇప్పటికే గోట్ మూవీ నిర్మాత… ప్రెస్ మీట్ సుడిగాలి సుధీర్ తమ సినిమాను వదిలేశాడని, ప్రమోషన్స్ కు రావడం లేదని… తాము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నామంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×