E-Paper
Advertisement

World’s No. 1 Helmet Producer: హెల్మెట్ అమ్మకాల్లో స్టీల్‌బర్డ్ దూకుడు.. 2025లో సరికొత్త రికార్డు!

World’s No. 1 Helmet Producer: హెల్మెట్ అమ్మకాల్లో స్టీల్‌బర్డ్ దూకుడు.. 2025లో సరికొత్త రికార్డు!

Steelbird Helmets 2026: స్టీల్‌ బర్డ్ హై టెక్ ఇండియా లిమిటెడ్ (స్టీల్‌బర్డ్ హెల్మెట్స్) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన హెల్మెట్లకు పెట్టింది పేరుగా కొనసాగుతోంది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా హెల్మెట్లను సరఫరా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైడర్ల నమ్మకాన్ని సంపాదించుకుంది. 2024, 2025లో ప్రపంచంలోనే నంబర్ 1 హెల్మెట్ ఉత్పత్తిదారుగా నిలిచిన స్టీల్‌ బర్డ్ హైటెక్ ఇండియా లిమిటెడ్.. 2026లోనూ హ్యాట్రిక్‌ కొట్టే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. 2024లో ఈ కంపెనీ దాదాపు 87.5 లక్షల హెల్మెట్లు అమ్మగా, 2025లో 93 లక్షల హెల్మెట్లను అమ్మింది.

2026 గురించి కంపెనీ ప్రణాళిక

2026 ఇప్పుడే ప్రారంభం అయిన నేపథ్యంలో..  కచ్చితంగా ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యధిక హెల్మెట్లు అమ్మి.. నెంబర్ వన్ కంపెనీగా హ్యాట్రిక్ కొట్టనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 60,000 హెల్మెట్లు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1000 కోట్ల రెవెన్యూ సాధించనున్నట్లు తెలిపారు.

భద్రత విషయంలో నో కాంప్రమైజ్

స్టీల్‌బర్డ్ ఆధిపత్యానికి కారణం అద్భుతమైన పనితీరు. ప్రొడక్ట్ క్వాలిటీ. ఈ కంపెనీ హెల్మెట్ ధరించిన వ్యక్తి యాక్సిండెంట్ సమయంలో రక్షణ పొందినట్లు కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ దేశంలోని తొమ్మిది ISO 9000 సర్టిఫైడ్ ప్లాంట్లలో హెల్మెట్ కు సంబంధించిన దాదాపు ప్రతి భాగాన్ని తయారు చేస్తుంది. అదే సమయంలో ప్రతి ప్లాంట్ ప్రపంచ స్థాయి సాంకేతికతను అందిపుచ్చుకుని పని చేస్తుంది. రోబోటిక్ పెయింటింగ్ సిస్టమ్స్, ప్రెసిషన్ మోల్డింగ్, ఆటోమేషన్ లైన్లు,  కఠినమైన పరీక్షల కోసం అత్యాధునిక టెస్ట్ ల్యాబ్ లు ఉన్నాయి. ఈ కంపెనీ హెల్మెట్లు ISI, ECE 22.06, DOT లాంటి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తుంది.

గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్

స్టీల్‌బర్డ్ కేవలం మార్కెట్ లీడర్ మాత్రమే కాదు. గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ అధినేత రాజీవ్ కపూర్ ను  ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి లాంటి అత్యున్నత సంస్థలు అంతర్జాతీయ రోడ్డు భద్రత గురించి ప్రసంగించేందుకు ఆహ్వానించాయి. ప్రపంచ హెల్మెట్ పరిశ్రమ నుంచి రెండుసార్లు ఆహ్వానించబడిన ఏకైక వ్యక్తిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడమే లక్ష్యంగా..

ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు ప్రపంచంలోనే భారత్ లో అత్యధికంగా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు స్టీల్‌బర్డ్ మిషన్ సేవ్ లైవ్స్ 2.0ను చేపట్టింది. ఇది ప్రత్యేకంగా నకిలీ, నాసిరకం హెల్మెట్ల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక డేటా ప్రకారం.. 2014, 2023 మధ్య దేశంలో 600,000 మందికి పైగా బైక్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు.  2023లోనే 79,533 మంది మరణించారు.

ప్రతి ఏటా 5 లక్షల హెల్మెట్ల పంపిణీ

స్టీల్‌బర్డ్ దేశం అంతటా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఎడ్యుకేషన్, హెల్మెట్ పంపిణీ కార్యక్రమాలను చేపడుతుంది. ప్రతి సంవత్సరం, దాదాపు 500,000 హెల్మెట్లను గ్రామాలు, పాఠశాలల్లో NGOలు, కార్పొరేట్‌ సంస్థలు, CSR సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో భాగస్వామ్యం ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ హెల్మెట్లను భారీగా సబ్సిడీ రేట్లకు అందిస్తుంది.  భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

పీపుల్ ఫస్ట్ ఆర్గనైజేషన్

స్టీల్‌బర్డ్ సంస్థలో 5,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కంపెనీ చూసుకుంటుంది. కంపెనీ ఫ్యాక్టరీ క్యాంటీన్‌లలో ప్రతిరోజూ చక్కటి పోషకాహారం అందిస్తుంది. ప్రతి ప్లాంట్ లో ధ్యానకేంద్రాలు, ప్రార్థనా స్థలాలను ఏర్పాటు చేసింది.

మరింత నెట్ వర్క్ విస్తరణ

దేశ వ్యాప్తంగా 330 కంటే ఎక్కువ స్టీల్‌బర్డ్ రైడర్ అవుట్‌ లెట్లు ఉన్నాయి. 100,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లకు  సరఫరా చేసే 2,000 మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ల సెంటర్లు ఉన్నాయి. సాంప్రదాయ పంపిణీ నెట్‌వర్క్‌ తో దేశ వ్యాప్తంగా రైడర్‌లకు అద్భుతమైన హెల్మెట్లు అందిస్తుంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోనూ హెల్మెట్ల అమ్మకాల్లో సత్తా చాటుతోంది. 2030 నాటికి 25 మిలియన్ల హెల్మెట్ల అమ్మకాలకు చేరుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కంపెనీ అధినేత కపూర్ వెల్లడించారు.

Read Also: స్టీల్‌బర్డ్ ఇగ్నైట్ To కోర్డా ఐకాన్.. ఇండియాలో బెస్ట్ హెల్మెట్స్ ఇవే!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×