E-Paper
Advertisement

గొర్రెలను అమ్మి కోటి రూపాయలతో సినిమా.. గొర్రెలు కాచుకునే మహిళ సంచలనం !

గొర్రెలను అమ్మి కోటి రూపాయలతో సినిమా.. గొర్రెలు కాచుకునే మహిళ సంచలనం !
Advertisement

spirit movie: సినిమా తీయాలంటే కోట్ల డబ్బు కాదు, చెక్కుచెదరని సంకల్పం ఉంటే చాలు అంటూ ప్రూవ్ చేస్తుంది ఒక సామాన్య “గొర్రెల కాపరి”. అవును.. అక్షరం ముక్క రాకపోతేనేం, తన కొడుకుని దర్శకుడిగా చూడటం కోసం పైసా పైసా కూడబెట్టి కోటి రూపాయలతో ఏకంగా సినిమానే నిర్మించింది చిన్నబోయిన నర్సమ్మ. కోట్ల డబ్బున్నా సినిమా నిర్మాణం అంటేనే భయపడే ఈ రోజుల్లో తెలంగాణ మట్టి మనిషి నర్సమ్మ చేసిన ఈ సాహసం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మట్టి మనిషి మహా సంకల్పం

Advertisement

ఒక వైపు గొర్రెల్ని కాయడం, మరో వైపు కూలి పనికి వెళ్లడం.. నర్సమ్మ రోజువారీ జీవితం ఇది. కానీ తన కొడుకు కల నెరవేర్చేందుకు తన వద్ద ఉన్న గొర్రెల్ని అమ్మి, రూపాయి రూపాయి కూడబెట్టి ఏకంగా కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా తీసింది. అసలు సినిమా ఎందుకు, ఉన్న డబ్బు కాస్తా పోవడానికే తప్ప అంటూ ఎంత మంది ఎగతాళి చేసినా పట్టించుకోకుండా “8th వండర్ సినిమా” అనే బ్యానర్ పెట్టి ‘స్పిరిట్’ అనే సినిమాని నిర్మించింది మట్టి మనిషి నర్సమ్మ.

సినీ దిగ్గజాల ప్రశంసలు

Advertisement

ఇక తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో లాంచ్ జరగగా, ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులు ఈ సినిమా కున్న విశేషాలను చూసి షాక్ అయ్యారు. వచ్చిన వారిలో డైరెక్టర్ వి. సముద్ర మాట్లాడుతూ, “ప్రభాస్ సినిమా టైటిల్‌తో వస్తున్న ఈ ‘స్పిరిట్’ వెనుక ఒక తల్లి కష్టముంది, ఆ కష్టమే సినిమాని సూపర్ హిట్ చేస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఇక సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ మరియు నిర్మాత రామ్ దాస్ మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఇంత ధైర్యమున్న నిర్మాతని చూడలేదని మెచ్చుకోవడం విశేషం. ఇక ప్రొడ్యూసర్ నర్సమ్మ మాట్లాడుతూ, “ఇది నా ఒక్కరిది కాదు అందరి సినిమా. మనం అందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తన మనసులోని మాటని మీడియాతో పంచుకుంది.

సినిమా విశేషాలు

సినిమా విషయానికి వస్తే యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించగా, రవిబాబు, సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇక ఎస్.ఎస్. వెంకటేష్, సంతోష్ కావాలా మ్యూజిక్ అందించగా, కౌసల్య, మాళవికలు పాడిన పాటలు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని తెలుస్తుంది.

విడుదల తేదీ

ఇక ఈ ‘స్పిరిట్’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని వచ్చే నెల మే 8న థియేటర్లలోకి రాబోతోంది. మరి కొడుకు కలని నెరవేర్చడం కోసం కోటి రూపాయలు కూడబెట్టి తీసిన నర్సమ్మ ‘స్పిరిట్’ సినిమా విజయవంతం కావాలని మనమూ మనస్పూర్తిగా కోరుకుందాం!

also read: మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లేముందు పిల్లలకి రేణు దేశాయ్ ఏం చెబుతుందో తెలుసా ?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×