E-Paper
Advertisement

సెటిల్ అయ్యాకే డబ్బులు ఇస్తా.. ధర్మేంద్రను బెదిరించిన అషురెడ్డి.. ఆడియో లీక్!

సెటిల్ అయ్యాకే డబ్బులు ఇస్తా.. ధర్మేంద్రను బెదిరించిన అషురెడ్డి.. ఆడియో లీక్!
Advertisement

Ashu Reddy: ప్రముఖ నటి బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి వ్యవహారం రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతుంది. రెండు రోజులుగా ఈమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనని నమ్మించి మోసం చేసి తన వద్ద నుంచి తొమ్మిదిన్నర కోటి రూపాయలు డబ్బు తీసుకుందంటూ లండన్ లో ఉన్న ఎన్నారై ధర్మేంద్ర(Y.V.Dharmendra) తండ్రి ఈమె పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అషురెడ్డి (Ashu Reddy) హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

కోటిన్నర మాత్రమే తిరిగి ఇస్తా..

ఈ వివాదంపై కనీసం తనపై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో తనని వివరణ కూడా అడగకుండా కేసు నమోదు చేయడం ఏంటి అంటూ ఈమె హైకోర్టును ఆశ్రయించారు. ఆశు రెడ్డికి సంబంధించి ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో మరోసారి ఈమె వివాదంలో నిలిచారు. ఇందులో భాగంగా ఈమె ధర్మేంద్రను బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ ఆడియో కాల్ లో భాగంగా ఈమె మాట్లాడుతూ.. తాను తీసుకున్న డబ్బులలో ఒకటిన్నర కోటి రూపాయలు మే నెలలో ఇస్తాను. అంతవరకు ఈ డబ్బు విషయంలో నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టొద్దు. మేలోగా నీకు ఇవ్వాల్సిన దాంట్లో తాను కోటిన్నర ఇస్తానని మిగిలింది తాను జీవితంలో సెటిల్ అయిన తర్వాత మాత్రమే ఇస్తానని తెలిపారు.

హరాస్మెంట్ కేసు పెడతాను..

Advertisement

అప్పటివరకు సైలెంట్ గా ఉండు అలా కాదని మొండికేసి నన్ను మాటికి డబ్బుల కోసం ఇబ్బంది పెడితే నేనే నీ పైన హరాస్మెంట్ కేసు పెడతానని ఈమె బెదిరించారు. ఈ విషయంలో నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నావని నేనే కేసు పెడతాను అంటూ ఈమె బెదిరింపులకు పాల్పడ్డారు.. నా తరఫునుంచి ప్రవీణ అక్క పెద్దమినిషిగా ఉంటుంది. నువ్వు వేణు స్వామిని తీసుకొస్తావా లేదా మరెవరినైనా తీసుకొస్తావో నీ ఇష్టం పెద్దల సమక్షంలో ఈ విషయం గురించి మాట్లాడి పరిష్కరించుకుందాం. మొండికేస్తే నేనే నీ పై కేసు పెడతానంటూ ఈమె బెదిరించారు. ప్రస్తుతం ఈ ఆడియో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈ ఆడియో ద్వారా ధర్మేంద్ర అషురెడ్డి గురించి చేసిన ఆరోపణలు నిజమేనని భావిస్తున్నారు అయితే ధర్మేంద్ర ఈమెపై ఫిర్యాదు చేస్తూ 2018లో పరిచయమైన ఈమె పెళ్లి చేసుకుంటానని చెప్పి తన నుంచి డబ్బులు తీసుకుందని ఆ డబ్బులతో విలాసవంతమైన కార్లు ఇల్లు కొనుగోలు చేసిందని తెలిపారు. పెళ్లి గురించి ప్రస్తావనకు రావడంతో ఈమె డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందంటూ ఈయన ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆడియో ద్వారా ధర్మేంద్ర ఆరోపణలు నిజమని కొందరు భావించగా మరికొందరు అసలు ఈ ఆడియో నిజమైనదేనా లేకపోతే ఏ ఐ ద్వారా సృష్టించబడినదా అనే విషయాల పట్ల విచారణ జరపాలని కూడా కోరుతున్నారు.

Also Read: పోకిరికి 20 ఏళ్లు.. బ్లాక్ బస్టర్ సినిమా ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదా.. బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే?

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×