E-Paper
Advertisement

Gunasekhar: మళ్లీ జన్మంటూ ఉంటే అలా పుట్టకూడదు.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Gunasekhar: మళ్లీ జన్మంటూ ఉంటే అలా పుట్టకూడదు.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Gunasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో గుణశేఖర్ (Gunasekhar)ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసిన ఘనత గుణశేఖర్ ది. గుణశేఖర్ డైరెక్షన్లో సినిమా అంటేనే భారీ స్థాయిలో సెట్టింగ్స్ గుర్తుకు వస్తాయి. ఇదివరకే ఈయన డైరెక్షన్లో వచ్చిన ఒక్కడు, రుద్రమదేవి వంటి సినిమాలు అందుకు నిదర్శనం. అయితే ఇటీవల కాలంలో గుణశేఖర్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారనే చెప్పాలి.

గుణశేఖర్ యుఫోరియా..

ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యుఫోరియా అనే సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గుణశేఖర్ తన డైరెక్షన్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మీడియా వారి నుంచి గుణశేఖర్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీకు మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలని కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నకు ఎదురు కావడంతో ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

డైరెక్టర్ గా పుట్టాలనుకోను..

Advertisement

ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టాలని మాత్రం అసలు కోరుకోను అంటూ ఈయన షాకింగ్ సమాధానం చెప్పారు.. సినిమాలంటే ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన గుణశేఖర్ నోటి నుంచి ఇలాంటి మాట రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు డైరెక్టర్ గుణశేఖర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి.. డైరెక్టర్ గా ఎందుకు పుట్టాలనుకోవడం లేదు అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

నిరాశపరిచిన శాకుంతలం..

Advertisement

ఒకప్పుడు సినిమాని చేయాలి అంటే దర్శక నిర్మాతలు ఎలాంటి ఒత్తిడికి గురయ్యే వారు కాదు కానీ ఇటీవల కాలంలో ఒక సినిమా చేయడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమా గురించి , దర్శకుల గురించి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుణశేఖర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటూ సందేహ పడుతున్నారు.. ఇకపోతే గుణశేఖర్ చివరిగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక యుఫోరియా సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా గుణశేఖర్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Funky Film: విశ్వక్ సేన్ ఫంకీ రన్ టైం లాక్…నిడివి ఎంతంటే?

Related News

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

Big Stories

Advertisement
×