E-Paper
Advertisement

Hamsa Nandini: క్యాన్సర్‌తో పోరాటం.. ఏకంగా 16 కిమో థెరపీలు.. ఆ రోజులను తలచుకుంటూ నటి ఎమోషనల్

Hamsa Nandini: క్యాన్సర్‌తో పోరాటం.. ఏకంగా 16 కిమో థెరపీలు.. ఆ రోజులను తలచుకుంటూ నటి ఎమోషనల్
Advertisement

Hamsa Nandini: సినిమా ఇండస్ట్రీలో తెరపై కనిపించే నటీనటుల జీవితాలు ఎంత హుందాగా కనిపించినా.. తెర వెనుక వారి బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి బారినపడి ఎంతోమంది ఆ కష్టాన్ని ఎదుర్కొని.. జయించినవాళ్లు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ హంస నందిని (Hamsa Nandini) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. మహారాష్ట్ర పూణేలో పుట్టి పెరిగిన ఈమె.. 2004లో ‘ఒక్కటవుదాం’ అనే తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత అధినేత , అనుమానాస్పదం, ప్రవరాఖ్యుడు తదితర చిత్రాలలో నటించిన హంసానందిని ‘మిర్చి’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

స్పెషల్ సాంగులతో భారీ గుర్తింపు..

అక్కడితో ఆగిపోకుండా ఎక్కువగా స్పెషల్ సాంగ్ లు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అలా శ్రీరస్తు శుభమస్తు , సోగ్గాడే చిన్నినాయన , బెంగాల్ టైగర్, జై లవకుశ, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య, లౌక్యం, లెజెండ్ ఇలా చెప్పుకుంటూపోతే చాలా చిత్రాలలో స్పెషల్ సాంగ్ లను చేసి అలరించిన ఈమె.. చివరిగా 2018లో గోపీచంద్ నటించిన ‘పంతం’ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. దీనికి కారణం ఆమె క్యాన్సర్ బారిన పడడమే.. 2021 చివర్లో ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తాను క్యాన్సర్ బారిన పడ్డానని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని మెల్లమెల్లగా ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయట పడతానని చెప్పింది..

కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడ్డ హంస నందిని..

Advertisement

ఇక అన్నట్టుగానే తన ఆత్మస్థైర్యాన్ని అంతటిని మూటగట్టుకుని మళ్లీ ముక్కలైన నా జీవితాన్ని నిర్మించుకున్నాను అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హంసనందిని చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఆమె షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అందులో విభిన్న కోణాలను.. ముఖ్యంగా తనలోని అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ఆ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో దిగిన ఈ ఫోటోలలో హంస నందిని చాలా ఉల్లాసంగా.. నవ యవ్వనంగా కనిపించింది. తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో పాటు నేను దేనికైనా సిద్ధం అనే ధైర్యాన్ని వ్యక్తపరిచింది.

ALSO READ:Dhurandhar 2: ధురంధర్ టీమ్ కు తెలుగు ఆడియన్స్ రిక్వెస్ట్.. ఎందుకంటే?

ముక్కలైన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నాను..

Advertisement

ఈ ఫోటోలతో పాటు హంసానందిని రాసిన ఎమోషనల్ నోటు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. “దృఢమైన వెన్నెముక.. మృదువైన హృదయం.. గట్టిగా నవ్వే నవ్వు.. నేను మళ్ళీ మళ్ళీ బ్రేక్ అయ్యాను.. అయినా సరే నన్ను నేను నిర్మించుకున్నాను.. మళ్ళీ కొత్తగా జన్మించాను” అంటూ తన జీవిత పోరాటం వెనుక ఉన్న బాధను చెప్పుకొచ్చింది. ఇక 16 సైకిళ్ల కీమోథెరపీ సర్జరీల తర్వాత ఆ మహమ్మారిని జయించాను అని , ముక్కలైన జీవితాన్ని మళ్లీ ధైర్యంతో నిర్మించుకున్నాను అని , తన పోరాట ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు ..ప్రాణాంతక వ్యాధిని చిరునవ్వుతో ఎదురుకొన్న ఈమె ధైర్యం నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన పోరాటం గురించి చెబుతూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×