E-Paper
Advertisement

Baingan Ka Bharta:రోటీ, పరాటాల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ట్రెడిషనల్ పంజాబీ బైంగన్ బర్తా రెసిపీ ఇదిగో

Baingan Ka Bharta:రోటీ, పరాటాల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ట్రెడిషనల్ పంజాబీ బైంగన్ బర్తా రెసిపీ ఇదిగో
Advertisement

Baingan Ka Bharta: వంకాయతో చేసే.. వంటకాల్లో బైంగన్ బర్తా (బైంగన్ కా బర్తా) చాలా ఫేమస్. ముఖ్యంగా పంజాబీ వంటకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. వంకాయను నేరుగా మంటపై కాల్చి, ఆ స్మోకీ ఫ్లేవర్‌తో ఉల్లిపాయలు, టమాటోలు, మసాలాలు కలిపి చేసే ఈ వంటకం అద్భుతమైన రుచిని ఇస్తుంది. రోటీ, పుల్కా లేదా పరాటాతో తింటే.. దీని రుచి మరెంతగానో పెరుగుతుంది. ఇంట్లోనే హోటల్ రుచితో, పంజాబీ స్టైల్‌లో దీనిని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమైన పదార్థాలు:
పెద్ద రకం వంకాయ (బర్తా వంకాయ – 1 పెద్దది)

Advertisement

సన్నగా తరిగిన ఉల్లిపాయలు (2)
టమాటోలు (2)
పచ్చిమిర్చి (3)
అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 టేబుల్ స్పూన్)
జీలకర్ర (1 టీ స్పూన్)
పసుపు (1/2 టీ స్పూన్)
కారం (1 టీ స్పూన్)
ధనియాల పొడి (1 టీ స్పూన్)
గరం మసాలా (1/2 టీ స్పూన్).
నూనె (3 టేబుల్ స్పూన్లు)
ఉప్పు (రుచికి సరిపడా)
సన్నగా తరిగిన కొత్తిమీర(తగినంత)

తయారీ విధానం:
1. ముందుగా వంకాయను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. వంకాయకు అక్కడక్కడా గాట్లు పెట్టి, ఆ గాట్లలో వెల్లుల్లి రెబ్బలను ఉంచాలి. దీని వల్ల వంకాయ లోపల కూడా బాగా ఉడకడమే కాకుండా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు వంకాయ పైన కొద్దిగా నూనె రాసి.. నేరుగా స్టవ్ మంటపై పెట్టి అన్ని వైపులా నల్లగా అయ్యే వరకు కాల్చాలి. వంకాయ మెత్తబడిన తర్వాత స్టవ్ కట్టేసి, దానిని చల్లారనివ్వాలి.

Advertisement

2. వంకాయ చల్లారిన తర్వాత.. పైన ఉన్న నల్లటి పొట్టును జాగ్రత్తగా తీసి వేయాలి. లోపల పురుగులు ఏవైనా ఉన్నాయేమో ఒక సారి చెక్ చేసి, కాడను తీసి వేసి వంకాయను మెత్తగా మెదపాలి. నీటితో కడగ కూడదు.. అలా చేస్తే స్మోకీ ఫ్లేవర్ పోతుంది.

3. అనంతరం ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక జీల కర్ర వేసి చిట పటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి పాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

Also Read: ఆరోగ్యానికి ‘వైట్ మ్యాజిక్’, ఎండలను తట్టుకోవాలంటే పెరుగు అన్నమే శరణ్యమట

4. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేయాలి. టమాటోలు పూర్తిగా మెత్తబడి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మసాలాలతో బాగా కలపాలి. మంటను తక్కువలో ఉంచి 5 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. దీని వల్ల మసాలాలన్నీ వంకాయకు బాగా పడతాయి.

6.చివరగా గరం మసాలా, తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. మీరు కావాలనుకుంటే చివర్లో ఒక చెంచా వెన్న కూడా వేయవచ్చు. ఇది పంజాబీ స్టైల్ రిచ్‌ నెస్‌ను ఇస్తుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×