E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ టీమ్ కు తెలుగు ఆడియన్స్ రిక్వెస్ట్.. ఎందుకంటే?

Dhurandhar 2: ధురంధర్ టీమ్ కు తెలుగు ఆడియన్స్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
Advertisement

Dhurandhar 2: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ (Adityadhar ) దర్శకత్వంలో రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా 7 దేశాలలో మొదటి స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ధురంధర్ మేకర్స్ కి తెలుగు ప్రేక్షకులు అభ్యర్థన..

ఇదిలా ఉండగా ధురంధర్ సినిమా సృష్టించిన ప్రభంజనానికి కొనసాగింపుగా మార్చి 19వ తేదీన ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు హిందీలో ట్రైలర్ రిలీజ్ చేయగా.. రీసెంట్గా ‘ధురంధర్: ది రివేంజ్’ పేరిట తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు ధురంధర్ మూవీ టీం కి రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ధురంధర్ 2 నిర్మాతలు తెలుగు ట్రైలర్ ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్ సంభాషణల పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. అటు తెలుగు డబ్బింగ్ పనులను హైదరాబాదులోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించినట్లు సమాచారం. అయితే తెలుగు ప్రేక్షకుల నుండీ దర్శకుడు ఆదిత్యధర్ కు ఒక స్పష్టమైన అభ్యర్థన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో అభిమానులు పాటలను తెలుగులోకి డబ్ చేయకుండా.. వాటి అసలు హిందీ వెర్షన్ లోనే ఉంచమని మేకర్స్ ను అడుగుతున్నారు.

కారణం?

Advertisement

కారణం.. గతంలో అనేక డబ్ చేసిన పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. అనువాదంలో విడుదలైన పాటలు, బలహీనమైన మిక్సింగ్ తో పాటు తప్పుడు అర్థాలు రావడం గమనించారు. ముఖ్యంగా డబ్ చేసి విడుదల చేసే పాటల వల్ల సోల్ పోతోందని.. అందుకే సినిమా మొత్తాన్ని డబ్బింగ్ చేసినా.. పాటలను మాత్రం హిందీలోనే ఉంచాలని కోరుతున్నారు. మరి నిర్మాతలు తెలుగు అభిమానుల అభ్యర్థనను పరిశీలిస్తారా? లేదా తెలుగు డబ్ చేసిన పాటలతోనే ముందుకు వెళ్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆదిత్యధర్ , జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధర్ కలసి సంయుక్తంగా నిర్మించారు.

ALSO READ:Film industry: రోజుకు 15 కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డు!

అంచనాలు పెంచేసిన యామి గౌతమ్..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాలో ఆదిత్యధర్ భార్య, ప్రముఖ నటి యామి గౌతమ్ కూడా మాట్లాడుతూ..” సినిమాపై అంచనాలు పెంచేసింది. తాను సినిమాలో ఒక పది నిమిషాల పాటు కనిపిస్తానని.. అయితే ఆ పది నిమిషాల సన్నివేశం సినిమాకి ఊహించని ఇమేజ్ అందించి పెడుతుందని స్పష్టం చేసింది.ధురంధర్ కి మించి ఈ సీక్వెల్ రాబోతోందని అటు మేకర్స్ కూడా స్పష్టం చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×