E-Paper
Advertisement

విడాకుల విషయంలో పశ్చాత్తాపం లేదు.. సంతోషంగా ఉన్నా.. ఫస్ట్ టైం స్పందించిన హన్సిక!

విడాకుల విషయంలో పశ్చాత్తాపం లేదు.. సంతోషంగా ఉన్నా.. ఫస్ట్ టైం స్పందించిన హన్సిక!
Advertisement

Hansika Motwani: హన్సిక మోత్వాని పరిచయం అవసరం లేని పేరు. దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తెలుగులో హన్సికకు విపరీతమైన సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో హన్సిక సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

విడాకుల తర్వాత హ్యాపీగా ఉన్నాను..

ఈమె ఇటీవల తన భర్తకు విడాకులు(Divorce) ఇచ్చినట్లు ప్రకటించడంతో ఈ విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. హన్సిక సోహెల్ కతురియా (Sohael Kathuriya)అనే వ్యక్తిని 2022 డిసెంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా ఉదయ్ పూర్ లో వివాహం చేసుకున్నారు. అయితే హన్సిక సోహెల్ కు రెండో భార్య కావడం గమనార్హం. అప్పటికే విడాకులు తీసుకొని విడిపోయిన సోహైల్ హన్సిక ప్రేమలో పడ్డారు. ఇలా ఘనంగా వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట ఇటీవలే విడాకులు ప్రకటించారు.

బాధపడుతూ బంధంలో ఉండే కంటే విడిపోవడం మంచిది..

Advertisement

ఇలా విడాకుల తర్వాత హన్సిక ఎక్కడ తన విడాకుల గురించి స్పందించలేదు కానీ మొదటిసారి ఈమె హౌటర్ ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన విడాకులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకున్నందుకు తాను ఏ మాత్రం పశ్చాత్తాపడలేదని, ఇప్పుడే తాను చాలా సంతోషంగా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నానని తెలిపారు. ఈమె తన విడాకుల గురించి మాట్లాడుతూ మనం ఏదైనా తప్పుడు రైలు ఎక్కినప్పుడు బాధపడుతూ అదే రైలులో ప్రయాణించడం కంటే దిగడమే మంచిది. అలాగే తన జీవితంలో కూడా క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి తాను బయటపడ్డానని అందుకు తాను బాధపడటం లేదంటూ ఈమె తెలియజేశారు.

కష్ట సమయంలో కుటుంబ మద్దతు..

Advertisement

తన జీవితంలో ఎదురైన క్లిష్ట సమయంలో తన కుటుంబం తనకు చాలా మద్దతుగా నిలబడిందని తన తల్లి సోదరుడు మద్దతు తనకు మరింత బలాన్ని ఇచ్చింది అంటూ ఈమె విడాకులు తీసుకొని విడిపోవడం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ఆఫ్ వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగానే హన్సిక విడాకులు తీసుకొని విడిపోయారని తెలుస్తోంది. ఇక సోహెల్ కతురియా పెళ్లికి ముందు హన్సిక బిజినెస్ పార్టనర్ కావడంతో వీరి పరిచయం పెరిగి పెళ్లి వరకు కారణమైంది. అయితే పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో వచ్చిన బేదాభిప్రాయాలు కారణంగా విడిపోయారని తెలుస్తోంది.

Also Read: తల్లి కాబోతున్న బుల్లితెర నటి… బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×