E-Paper
Advertisement

వందల కోట్ల ఆఫర్లు రిజెక్ట్.. ప్రభాస్ ‘స్పిరిట్’ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

వందల కోట్ల ఆఫర్లు రిజెక్ట్.. ప్రభాస్ ‘స్పిరిట్’ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Advertisement

Prabhas Spirit: యానిమల్ తర్వాత ప్రభాస్ తో సినిమా అనగానే అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా కలెక్షన్స్ 2000 కోట్లని, డిజిటల్ రైట్స్ 300 కోట్లని, టోటల్ గా రికార్డులన్నీ రీరైట్ అని ఇలా ఎవరికి ఊహించినట్టుగా వాళ్లు లెక్కలేసుకోవడం మొదలెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఏకంగా 300 నుండి 350 కోట్లు ఆఫర్

Advertisement

సందీప్ వంగా గత సినిమా యానిమల్ కి ఓటిటీలో ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. దీంతో అదే క్రేజ్ కారణంగా ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ కోసం నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఏకంగా 300 నుండి 350 కోట్లు ఆఫర్ చేయడానికి రెడీ అయ్యాయన్న వార్తలు నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే మేకర్స్ లెక్క మాత్రం వేరుగా ఉంది. స్పిరిట్ కి ఉన్న క్రేజ్ వేరే అని, ఇప్పుడు ఓటిటి లు ఆఫర్ చేస్తున్న దానికి కమిట్ అయితే రేపు సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత వచ్చే హైప్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారట. సో సినిమా అవుట్‌పుట్ చూసాకే రేట్లను ఫిక్స్ చేయాలని వారు అనుకుంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే సినిమా కంటెంట్ అండ్ క్వాలిటీ మీద మేకర్స్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. మరో వైపు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ దగ్గర పెట్టుబడికి లోటు లేకపోవడం కూడా ఇలాంటి డేరింగ్ డిసీషన్ తీసుకోవడానికి ఒక కారణం అని చెప్పాలి.

అక్టోబర్ 23, 2026న ఒక పవర్ ఫుల్ గ్లింప్స్

Advertisement

నిజానికి ఒక పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయిన వెంటనే ఓటిటి, శాటిలైట్ హక్కుల కోసం పోటీ మొదలవుతుంది. కానీ స్పిరిట్ విషయంలో మేకర్స్ వేసిన ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అయితే సినిమా కాస్త అటూ ఇటూ అయినా వీళ్ల స్ట్రాటజీ బూమరాంగ్ అవడం ఖాయం.ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యమా జోరుగా జరుగుతోంది. ఈ మధ్యే షూటింగ్ సెట్స్‌లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి కొంత ఇబ్బంది ఏర్పడ్డా షూటింగ్ షెడ్యూల్స్ అలాగే కంటిన్యూ అవుతాయని, సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే షూటింగ్ ఇలాగే స్పీడ్ గా జరిగితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23, 2026న ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉందన్న మాట.

2027 మార్చి 5 వరకు వేచి చూడాల్సిందే

ప్రభాస్ మొదటిసారిగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా భారతీయ భాషలతో పాటు కొరియన్ భాషలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం.ఇక  త్రిప్తీ డిమ్రి హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా చూడాలంటే మాత్రం  ఫ్యాన్స్ 2027 మార్చి 5 వరకు వేచి చూడాల్సిందే.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×