E-Paper
Advertisement

వేధింపులపై నోరు విప్పితే హెచ్‌ఆర్ బెదిరింపులు? టీసీఎస్‌లో బయటపడ్డ చీకటి కోణాలు

వేధింపులపై నోరు విప్పితే హెచ్‌ఆర్ బెదిరింపులు? టీసీఎస్‌లో బయటపడ్డ చీకటి కోణాలు
Advertisement

TCS Nashik Scandal: టెక్ సంస్థ‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ యూనిట్‌లో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఉదంతం కార్పొరేట్ రంగంలో క‌ల‌కలం రేపుతొంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాసెస్ అసోసియేట్ నిదా ఖాన్ను కంపెనీ సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన జారీ చేసిన సస్పెన్షన్ లేఖలో, ఆమెపై నమోదైన ఆరోపణలు తీవ్రమైనవి అని టీసీఎస్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె పోలీసు కస్టడీలో ఉన్నందున, తక్షణమే విధులకు హాజరుకావద్దని, కంపెనీ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ను రద్దు చేస్తున్నట్లు హెచ్‌ఆర్ హెడ్ శేఖర్ కాంబ్లే స్పష్టం చేశారు.

ఈ వివాదం 2022లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నిదా ఖాన్ సోదరుడు డానిష్ షేక్, తన సహోద్యోగిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అయితే అతనికి అప్పటికే వివాహం జరిగిందనే విషయాన్ని దాచిపెట్టారని బాధితురాలు ఆరోపించింది. ఈ ప్రక్రియలో నిదా ఖాన్ కీలక పాత్ర పోషించిందని, బాధితురాలి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చిందని పోలీసు నివేదిక పేర్కొంది. మరో నిందితుడు తౌసిఫ్ అక్తర్‌తో కలిసి నిదా ఈ మొత్తం విషయాన్ని రహస్యంగా ఉంచి బాధితురాలిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో, టీసీఎస్‌లో పనిచేస్తున్న మరో ఏడుగురు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పై అధికారులు తమను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని, హోటళ్లకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారని వారు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదులను హెచ్‌ఆర్ (HR) విభాగం పట్టించుకోకపోవడమే కాకుండా, ఇలాంటివి సర్వసాధారణం, గొడవ చేయవద్దు అని బాధితులను బెదిరించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఒక మహిళా హెచ్‌ఆర్ హెడ్‌తో సహా మొత్తం ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

కేసు నమోదైనప్పటి నుండి నిదా ఖాన్ పరారీలో ఉన్నారు. అయితే, తాజాగా ఆమె ముంబైలో ఉన్నట్లు, ఆమె గర్భవతి అని, త్వరలోనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపుతూ ఆమె నాసిక్ స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెపై నేరుగా నేరారోపణలు లేవని, కేవలం చర్చల్లో మాత్రమే పాల్గొన్నారని ఆమె తరపు న్యాయవాది బాబా సయ్యద్ వాదిస్తున్నారు.

Advertisement

Read Also: TCS Nashik Case: మహిళా ఉద్యోగులపై వేధింపులు.. మత మార్పిడికై ఒత్తిడి.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!

Related News

యూపీఐ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రూ.2,000 దాటితే ఛార్జీల మోత.. రానున్న మార్పులివే!

100 పర్సెంట్ ప్యూర్ అంటూ మోసం.. డాబర్ కంపెనీ తేనె, నెయ్యి సహా పలు ప్రొడక్ట్స్‌పై నిషేధం..

పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. మార్కెట్లో తులం ధర ఎంత? ఇంకెందుకు ఆలస్యం

ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

Big Stories

Advertisement
×