E-Paper
Advertisement

HBD Thaman: 11 ఏళ్ళకే కుటుంబ బాధ్యతలు.. తమన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

HBD Thaman: 11 ఏళ్ళకే కుటుంబ బాధ్యతలు.. తమన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!
Advertisement

HBD Thaman: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస సినిమాలకు సంగీతం అందిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ (S.Thaman). ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. తాజాగా బోయపాటి శ్రీను(Boyapati Srinu)దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా వస్తున్న అఖండ 2 సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ నటించిన నాలుగు చిత్రాలకు సంగీతాన్ని అందించి మంచి విజయాలను సొంతం చేసుకున్న తమన్.. ఇప్పుడు మరోసారి అఖండ 2 కోసం భారీగా కష్టపడుతున్నారు. అంతేకాదు పండిత ద్వయంతో పాటు సింగర్స్ ద్వయాన్ని కూడా రంగంలోకి దింపుతూ ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలను అందించనున్నారు.

తమన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఇకపోతే ఈరోజు తమన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 1993 నవంబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో జన్మించారు.. ఈయన అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్.. వృత్తిపరంగా ఎస్. తమన్ తన పేరును మార్చుకున్నారు. సంగీత నేపథ్య కుటుంబంలో జన్మించిన తమన్ చెన్నైలో పెరిగారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు.. తండ్రి ఘంటసాల శివకుమార్.. డ్రమ్మర్ గా పనిచేశారు. సంగీత దర్శకుడు కె చక్రవర్తి ఆధ్వర్యంలో 700 చిత్రాలకు పనిచేశాడు ఈయన. తల్లి ఘంటసాల సావిత్రి. సోదరి యామిని ఘంటసాల అలాగే అత్త బి. వసంత నేపథ్య గాయకురాలు.

11 ఏళ్లకే ఇండస్ట్రీలోకి..

Advertisement

ఇకపోతే ఈయన తన తండ్రిని మొదటి గురువుగా భావించి తన తండ్రి పేరు అయినా శివకుమార్ లోని ఎస్ అనే లెటర్ ను తీసుకొని ఎస్. తమన్ గా మారిపోయారు. ఇకపోతే 11 సంవత్సరాల వయసులోనే 1994లో భైరవద్వీపం చిత్రానికి నేపథ్య సంగీతం కోసం తన తండ్రితో కలిసి పనిచేసే సపోర్టింగ్ డ్రమ్మర్ గా తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టారు అలా 11 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్గా మారడానికంటే ముందు ఏకంగా ఏడు వేలకు పైగా స్టేజ్ షోలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చారు. అలాగే తొమ్మిది వందల చిత్రాలకు రిథమ్ , బాక్స్ ప్లేయర్, కీబోర్డు, ప్రోగ్రామర్ డ్రమ్మర్ గా 64 మంది భారతీయ సంగీత దర్శకుల వద్ద పనిచేశారు.

13 ఏళ్లకే కుటుంబ బాధ్యతలు..

కిక్ అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తమన్. ఇకపోతే తమన్ చెన్నైలోని బోస్టన్ స్కూల్లో చదువుకున్నారు. 9 సంవత్సరాల వయసులోనే ఎస్పీ బాలసుబ్రమణ్యం, జి.ఆనంద్ లతో కూడిన సంగీత బృందం అయినా రిథమ్ ప్యాడ్ వాయించే వ్యక్తిగా చేరిన ఈయన.. ఆ తర్వాత 13 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాడు. అలా తండ్రి కోల్పోవడంతో తన కుటుంబంలో సంక్షోభం ఏర్పడడంతో దానిని అధిగమించడానికి కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకొని తన అభిరుచిని వృత్తిగా మార్చుకున్నారు. అలా 13 ఏళ్లకే కుటుంబ బాధ్యతలు చేపట్టిన కీరవాణి దగ్గర కూడా 30 చిత్రాలకు మూడు సంవత్సరాల పాటు పని చేశారు.

తమన్ భార్య ఎవరంటే?

Advertisement

తమన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ సింగర్ శ్రీవర్ధినిని ఈయన వివాహం చేసుకున్నారు. ఈమె స్వరాభిషేకం వంటి సింగింగ్ కాంపిటీషన్ షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ALSO READ:Akhanda 2: ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. త్రిబుల్ ట్రీట్.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×