E-Paper
Advertisement

Harish Shankar: పవన్ కళ్యాణ్ కి డూప్ గా హరీష్ శంకర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Harish Shankar: పవన్ కళ్యాణ్ కి డూప్ గా హరీష్ శంకర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Advertisement

Harish Shankar: ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఎప్పుడో మార్చి 26న రావాల్సిన ఈ సినిమా అభిమానుల కోసం ముందుగానే మార్చి 19న అనగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీనికి తోడు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సినిమాపై ప్రమోషనల్ కార్యక్రమాలను వేగంగా చేపడుతూ అటు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి డూప్.. రూమర్స్ పై డైరెక్టర్ క్లారిటీ..

ఈ నేపథ్యంలోనే పవన్ కి డూప్ గా హరీష్ శంకర్ నటించారు అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ తనపై వస్తున్న రూమర్ల గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి నేను డూప్ గా నటించినట్లు వార్తలు వస్తున్నాయి. నన్ను పవన్ కళ్యాణ్ తో పోల్చడం సంతోషం . ఇది అదృష్టంగా భావిస్తున్నాను. అయినప్పటికీ ఆయన స్థానంలో నేను నటించలేదు. హీరోల భద్రత, నిర్మాతలకు నష్టం కలగకుండా ఉండేందుకే రిస్క్ ఉన్న సన్నివేశాలలో ప్రొఫెషనల్ డూప్ లను మాత్రమే ఉపయోగిస్తాము” అంటూ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే తనను పవన్ కళ్యాణ్ తో పోల్చినందుకు సంతోషపడినా.. తాను మాత్రం పవన్ కళ్యాణ్ కి డూప్ గా నటించలేదు అని రూమర్లకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.

గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Advertisement

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది . ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి ఊహించిన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి మార్చి 19వ తేదీన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ను తాను ఎలా చూపించాలి అనుకున్నానో అలా ఈ సినిమా ద్వారా చూపిస్తానని హామీ ఇచ్చారు. పైగా ఈ సినిమాపై అంచనాల పెంచుతూ చేస్తున్న ఒక్కో కామెంట్ కి అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

also read:Hero Vishal: రాజేంద్రప్రసాద్ పై హీరో విశాల్ మండిపాటు.. క్షమాపణలు చెప్పాల్సిందే?

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విశేషాలు..

Advertisement

ఇక హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీ లీల రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×