E-Paper
Advertisement

Durandhar Movie: ‘ధురంధర్’ సినిమాపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. డెకాయిట్ ఎలా ఉంటదంటే?

Durandhar Movie: ‘ధురంధర్’ సినిమాపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. డెకాయిట్ ఎలా ఉంటదంటే?
Advertisement

Durandhar Movie: ప్రస్తుత కాలంలో ఒక సినిమా విజయాన్ని కేవలం అది వసూలు చేసిన ‘కోట్ల’తోనే కొలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది? అనే చర్చలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ వెర్సటైల్ నటుడు అడవి శేష్ చేసిన వ్యాఖ్యలు అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తన లేటెస్ట్ మూవీ ‘ధురందర్’ పట్ల ఆయన చూపిన నమ్మకం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్న అడివి శేష్, ‘ధురందర్’ సినిమా గురించి మాట్లాడుతూ ఒక పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. “థియేటర్లలో ‘ధురందర్’ చూసినప్పుడు నాకు అర్థమైంది.. ఇది కేవలం ‘గోల్డ్’ లాంటి సినిమా కాదు, ఇది ‘ప్లాటినం’ ” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంటే, ఈ సినిమా కేవలం కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడమే కాకుండా, క్వాలిటీ పరంగా అత్యున్నత ప్రమాణాలతో ఉందని ఆయన నొక్కి చెప్పారు.

Read also-Harish Shankar: పవన్ కళ్యాణ్ కి డూప్ గా హరీష్ శంకర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

వసూళ్ల కంటే..

Advertisement

సోషల్ మీడియా హడావిడిని పక్కన పెడితే, సగటు ప్రేక్షకుడికి కావాల్సింది కేవలం ఒక మంచి సినిమా మాత్రమేనని శేష్ అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పినట్లుగా, ‘మాయాబజార్’ లేదా ‘షోలే’ వంటి క్లాసిక్ చిత్రాలు ఆ కాలంలో ఎంత వసూలు చేశాయనే లెక్కలు ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, ఆ సినిమాలు మనల్ని ఎంతగా అలరించాయి, ఇప్పటికీ మన మనసుల్లో ఎంతటి చెరగని ముద్ర వేశాయి అనేదే ముఖ్యం. సినిమా విజయం అనేది బాక్సాఫీస్ రిపోర్ట్ కార్డులో కాదు, ప్రేక్షకుడు పొందే అనుభూతిలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Read also-Virosh couple: పెళ్లి తర్వాత ఎయిర్‌పోర్టులో కనిపించిన విరోష్ జంట.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

నిర్మాత క్షేమమే..

Advertisement

ఒక సినిమా కేవలం కళ మాత్రమే కాదు, అది ఒక వ్యాపారం కూడా. ఈ విషయాన్ని శేష్ చాలా బాధ్యతాయుతంగా గుర్తు చేశారు. “మనం ఎంత అద్భుతమైన సినిమా తీశాం అనేది ఎంత ముఖ్యమో, మనల్ని నమ్మిన నిర్మాతను సేఫ్ చేయడం కూడా అంతే ముఖ్యం” అని ఆయన అన్నారు. బడ్జెట్ పరిమితులను దాటకుండా, నిర్మాతకు నష్టం కలగకుండా జాగ్రత్త పడుతూనే.. అత్యున్నత ప్రమాణాలతో సినిమాను రూపొందించడమే అసలైన ప్రతిభ అని ఆయన అభిప్రాయపడ్డారు. అడవి శేష్ మాటలు నేటి యువ దర్శకులకు మరియు నటులకు ఒక దిశానిర్దేశంలా ఉన్నాయి. కేవలం హైప్ కోసం, రికార్డుల కోసం పాకులాడకుండా.. నిజాయితీతో కూడిన ‘ప్లాటినం’ లాంటి సినిమాలు తీస్తే, బాక్సాఫీస్ వద్ద విజయం దానంతట అదే వస్తుందని ఆయన మాటల సారాంశం. ‘ధురందర్’ చిత్రం ద్వారా ఆయన మరోసారి కంటెంట్ పవర్ ఏంటో చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×