E-Paper
Advertisement

Hareesh Shankar: అత్యాశ పడుతున్న హరీష్ శంకర్..అదయ్యే పనేనా ?

Hareesh Shankar: అత్యాశ పడుతున్న హరీష్ శంకర్..అదయ్యే పనేనా ?
Advertisement

Hareesh Shankar: దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. రేపే  విడుదల కాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద ఆయన చూపుతున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. అది ‘అతివిశ్వాసమా?’ లేక నిజంగానే కంటెంట్ ఉందా? అన్న అనుమానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘మిస్టర్ బచ్చన్’ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా హరీష్ తీరు మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘ఉస్తాద్’ గట్టెక్కుతుందా? లేక ముంచుతుందా?
బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్ ది రివెంజ్’ లాంటి గట్టి పోటీ ఉంది. పైగా సోషల్ మీడియాలో ‘ఓజి’ (OG)కి ఉన్నంత క్రేజ్ ఉస్తాద్‌కి లేదన్నది నగ్న సత్యం.
ఏపీ, ఓవర్సీస్‌లో పడబోయే ఎర్లీ మార్నింగ్ బెన్ ఫిట్ షోలే హరీష్ భవిష్యత్తును తేల్చేయనున్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నా.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ కలెక్షన్లు రాకపోతే హరీష్ కెరీర్ డేంజర్ జోన్‌లో పడటం ఖాయం.

Advertisement

చిరంజీవిని టార్గెట్ చేస్తున్న హరీష్.. ఇది సాధ్యమేనా?
ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి వింటేజ్ చిరుని చూపిస్తానని హరీష్ పదే పదే చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మొహమాటం కొద్దీ మెహర్ రమేష్‌కు అవకాశం ఇచ్చి చిరంజీవి ఎంత పెద్ద తప్పు చేశారో ఆయనకు తెలుసు. ఇప్పుడు హరీష్ విషయంలో కూడా అదే రిస్క్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం చూశాక, కేవలం మాస్ డైలాగులు రాసినంత మాత్రాన చిరు సినిమా ఇచ్చేస్తారా? అంటే అనుమానమే.

2028 దాకా వెయిటింగ్ లిస్టే!
ఒకవేళ ‘ఉస్తాద్’ బ్లాక్ బస్టర్ అయినా.. చిరంజీవి లైనప్ చూస్తుంటే హరీష్‌కు ఇప్పట్లో ఛాన్స్ దొరికేలా లేదు.ఇప్పటికే మెగా 158 బాబీతో, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇక అవి అవ్వాలంటే రెండేళ్ళు గ్యారంటీ. మరో వైపు   హరీష్  ఇతర హీరోలతో సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకున్నాడన్న టాక్ ఉంది . మరి ఇప్పుడు చిరు కోసం 2028 దాకా వెయిట్ చేస్తారా? లేక హరీష్ కేవలం హైప్ కోసం ఈ మాటలు చెబుతున్నారా? అన్నది హాట్ టాపిక్.చూస్తుంటే హరీష్ శంకర్ ఖచ్చితంగా ‘అతి’గా ఆశపడుతున్నట్లే కనిపిస్తోంది. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ మాత్రం తేడా కొట్టినా.. చిరంజీవి అపాయింట్‌మెంట్ దొరకడం హరీష్‌కు కలగానే మిగిలిపోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు!

Advertisement

also read: టాలీవుడ్ స్టార్స్.. టేస్టీ బిజినెస్.. హీరోల ఫేమస్ రెస్టారెంట్లు ఇవే

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×