E-Paper
Advertisement

హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

Harsha Sai: హర్ష సాయి ..ఆ మధ్య ఈ పేరు సోషల్ మీడియాని ఎంతలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో ఇతగాడి సేవా కార్యక్రమాల వీడియోలు తెగ చక్కర్లు కొట్టాయ్. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారెవరినైనా ఆదుకుంటా అంటూ బాబా రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన ఈయన వీడియోలు చూసి లక్షల సంఖ్యలో  ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. అయితే ఇంతలా క్రేజ్ కొట్టేసిన హర్ష సాయి సడెన్ గా మాయం అవడంతో  ‘మత గురువు’ రేంజ్‌లో ప్రొజెక్ట్ చేసుకున్న ఈ సోషల్ మీడియా స్టార్ ‘అసలెక్కడికి వెళ్ళిపోయాడు,కొంపదీసి  పోలీసుల భయంతో అడ్రస్ లేకుండా పారిపోలేదు కాదా’ అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజనులు.ఒకవైపు పెళ్లి పేరుతో మోసం, మరోవైపు సినిమా ముసుగులో చీటింగ్ అలిగేషన్స్ అన్నీకలగలిపి హర్ష సాయి ‘మెగా’ ఇమేజ్ ఇప్పుడు అట్టడుగుకు పడిపోయినట్టే కనిపిస్తుంది.

చారణ కోడికి బారాణా మసాలా

నిజానికి హర్ష సాయి చేసే వీడియోలు చూసి ఏంతో మంది అమాయకులు దేవుడిలా కొలిచారన్నది నిజం. ఆ సహాయం వెనుక ఉన్నది చేయాలన్న మనసు కాదు,కేవలం యూట్యూబ్ వ్యూస్ ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఇన్కమ్  మాత్రమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. చారణ కోడికి బారాణా మసాలా అన్నట్టుగా ఒక రూపాయి ఇచ్చి పది రూపాయల పబ్లిసిటీ చేసుకున్నాడని, ఇదే కాన్సెప్ట్ తో ఏకంగా సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకొని  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘కొత్త మెగాస్టార్’ అనిపించుకోవాలని చూసిన అతడి ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టిందనే చెప్పాలి.

హర్షపై సెక్సువల్ హెరాస్ మెంట్ కేస్ 

నిజానికి హర్ష సాయి కథ, దర్శకత్వంలో ‘మెగా’ అనే సినిమా మొదలైనప్పుడు టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ ఆ గాలి అప్పటి వరకే అన్నట్టుగా మెల్లిగా ఈ సినిమా వెనుక డార్క్ షేడ్స్ మెల్లిగా బయటికి వస్తుండటం తో అతగాడి లీలలు ఒక్కోటిగా బయటకి వస్తున్నాయ్.ముఖ్యంగా  ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్న అమ్మాయే  స్వయంగా హర్షపై సెక్సువల్ హెరాస్ మెంట్ కేస్ పెట్టడం సంచలనం సృష్టించింది.సినిమా షూటింగ్ సాకుతో ఆమెను ఆర్థికంగా, మానసికంగా వేధించాడనే వార్తలు హర్ష సాయి అసలు రంగును బయటపెట్టాయి.ఇక ఆ కేసు ఫైల్ అయినప్పటి నుండి హర్ష సాయి సోషల్ మీడియాకు, కనీసం ఫోన్ సిగ్నల్‌కు కూడా దొరకకుండా పోయాడు.

also read:ఆదిత్య ధర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రభాస్-సూర్య మల్టీస్టారరా.. లేక రామ్ చరణ్ ‘అశ్వత్థామ’నా? ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్!

దుబాయ్ షేక్ అయ్యావా లేక దుబాయ్ పారిపోయావా?

దీంతో గత ఏడాది నుండి హర్ష సాయి నుంచి ఒక్క అప్‌డేట్ కూడా లేకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు.’దానం చేసేప్పుడు కెమెరా ఉండేది.. ఇప్పుడు ఎక్కడా కెమెరా కనిపించడం లేదా బ్రో?’అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే ‘దుబాయ్ షేక్ అయ్యావా లేక దుబాయ్ పారిపోయావా?”అంటూ హర్ష గత వీడియోలను పేరడీ చేస్తు చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే  పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న వార్తలతో, హర్ష సాయి దేశం దాటి వెళ్లిపోయాడనే ప్రచారం గట్టిగానే  సాగుతోంది.

మెగా’ టైటిల్‌తో మొదలైన  సినిమా అటకెక్కినట్టే?

ఇక అట్టహాసంగా రెండేళ్ల క్రితం ‘మెగా’ టైటిల్‌తో మొదలైన  సినిమా ఇప్పుడు పూర్తిగా అటకెక్కినట్టే కనిపిస్తోంది.అప్పట్లో   భారీ బడ్జెట్, పాన్ ఇండియా లెవల్ అంటూ తెగ హడావిడి చేసిన  హర్ష, ఇప్పుడు కనీసం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేయడం చూస్తుంటే.. ఆ సినిమా కేవలం ఒక పబ్లిసిటీ గిమ్మిక్కేనా? అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

ఏది ఏమైనా  రీల్ లైఫ్‌లో హీరోలా కనిపించిన హర్ష సాయి, రియల్ లైఫ్ వివాదాల్లో చిక్కుకుని తన ఇమేజ్‌ను మొత్తం పాడు చేసుకున్నాడనే చెప్పాలి. మరి ఈ ‘రీల్ మెగాస్టార్’వివాదాల నుండి బయటపడి మళ్ళీ కెమెరా ముందుకు వస్తాడో .. లేక ఇలాగే అజ్ఞాత వాసిగా మిగిలిపోతాడో కాలమే డిసైడ్ చేయాలి !

also read:తారక్ విశ్వరూపం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో శత్రుసంహారం! బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ మారణహోమం ఖాయమా?

Related News

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

Big Stories

×