E-Paper
Advertisement

దుమ్మురేపే ప్లాన్.. ఏడాది పాటు రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్!

దుమ్మురేపే ప్లాన్.. ఏడాది పాటు రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్!
Advertisement

Vi Plan: ప్రముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. నెలవారి, త్రైమాసికం, వార్షిక ప్లాన్స్ ను వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇప్పటికే అందుబాటులో ఉంచింది. అయితే ఏడాది పొడవున భారీ డేటా, అపరిమిత కాల్స్, ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కోరుకునేవారి కోసం వీఐ ఓ సాలిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.3999 ధర కలిగిన ఆ ప్లాన్ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రతీరోజూ 2GB డేటా

వీఐ తన రూ.3999 ప్లాన్ ను 365 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతీరోజూ 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ (Unlimited Calls) చేసుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు సైతం పొందవచ్చు.

ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు

Advertisement

రూ.3999 ప్లాన్ లో ప్రత్యేక ఆకర్షణగా కింద ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ సైతం వీఐ ఆఫర్ చేస్తోంది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదిపాటు జియో-హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు. దీని ద్వారా అమెజాన్ ఓటీటీ కంటెంట్ తో పాటు షాపింగ్‌లో ఉచిత డెలివరీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Also Read: ఫ్యామిలీలో తలా ఒక రీఛార్జ్ ప్లాన్ వాడుతున్నారా? ఎందుకు భయ్యా డబ్బు వేస్ట్.. వీటిని ట్రై చేయండి!

మరికొన్ని అదనపు ఆఫర్లు

Advertisement

వార్షిక ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వీఐ ఎక్స్ క్లూజివ్ గా అందించే ప్రత్యేకమైన అదనపు ప్రయోజనాలు సైతం యూజర్ పొందవచ్చు. దీని ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు (12 AM – 12 PM) అపరిమిత ఉచిత డేటా వాడుకోవచ్చు. దీనికి మీ రోజువారీ డేటా పరిమితితో సంబంధం ఉండదు. అలాగే వీకెండ్ డేటా రోల్ ఓవర్ ఫీచర్ కింద సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు వాడకుండా మిగిల్చిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అదే విధంగా అత్యవసర సమయాల్లో ప్రతి నెలా 2GB బ్యాకప్ డేటాను (రోజుకు 1GB చొప్పున) ఉచితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

Also Read: బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పాచి పోయినది వేడి వేడిగా డెలివరీ..!

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×