E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: సంక్రాంతి వైబ్స్ అంటూ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్ ..

Samantha -Raj Nidimoru: సంక్రాంతి వైబ్స్ అంటూ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్ ..
Advertisement

Samantha -Raj Nidimoru: సినీ నటి సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సమంత ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న సమంత తన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా గడుపుతున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ సమంత(Samantha) డైరెక్టర్ రాజ్ నిడిమోరును (Raj Nidimoru)ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడంతో వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

భర్త రాజ్ తో సమంత సంక్రాంతి..

ఈ వార్తలకు అనుగుణంగానే సమంత రాజ్ ఇద్దరు గత ఏడాది లింగ బైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత సమంత ఇటీవల ఎక్కడికి వెళ్ళినా తన భర్తతో జంటగా, సంతోషంగా కనిపించడంతో అభిమానులు కూడా వీరిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత రెండో పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత రాజ్ తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ సంక్రాంతి వైబ్స్ అంటూ ఈ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసినా అభిమానులు సమంత దంపతులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మా ఇంటి బంగారం..

Advertisement

ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ఈమె ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లలోనే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఆగిపోయింది అంటూ వార్తలు బయటకు వస్తున్న, ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీ రాలేదు ఈ వెబ్ సిరీస్ తో పాటు ఈమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

లేడీ ఓరియంటెడ్ సినిమాగా, డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా స్వయంగా సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక సమంత చివరిగా వెండితెరపై విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం సమంత ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా బ్రేక్ తీసుకున్న సమంత తిరిగి మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Puri- vijay Sethupathi: పూర్తి సేతుపతి సినిమా టైటిల్ పోస్టర్..ఫస్ట్ లుక్ రిలీజ్…

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×