E-Paper
Advertisement

Eesha Trailer:ఒళ్లు గగుర్పొడిచేలా ఈషా ట్రైలర్… ఇంత భయంకరంగా ఉందేంటీ!

Eesha Trailer:ఒళ్లు గగుర్పొడిచేలా ఈషా ట్రైలర్… ఇంత భయంకరంగా ఉందేంటీ!
Advertisement

Eesha Trailer: నటుడు త్రిగున్ , హెబ్బా పటేల్ (Hebah patel )ప్రధాన పాత్రలలో నటిస్తున్న హర్రర్ చిత్రం ఈషా(Eesha). ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ హర్రర్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.2.28 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠంగా భరితంగా కొనసాగిందని చెప్పాలి.

దడ పుట్టిస్తున్న ఈషా ట్రైలర్..

ఈ ట్రైలర్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొదుస్తుందని చెప్పాలి. హర్రర్ సినిమాలను ప్రేమించే వారికి ఇదొక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో కావాల్సినన్ని ట్విస్టులు కూడా ఉండబోతున్నాయని ఇటీవల విడుదల చేసిన టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.మీరు ఇప్పటివరకూ చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉందనే డైలాగు సినిమా పట్ల మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు శ్రీనివాసమన్నే దర్శకత్వం వహించగా పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు.

హర్రర్ లవర్స్ కు పండగే..

Advertisement

ఇక ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి సమర్పణలో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే వీరిద్దరూ లిటిల్ హార్ట్స్, రాజు రాంబాయి సినిమాలను విడుదల చేస్తూ ఎంతో అద్భుతమైన లాభాలను, విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ ఈషా సినిమాని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి . ఇక ఈ సినిమాలో సిరి హనుమంత్, పృధ్విరాజ్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక హర్రర్ సినిమాలంటే భయపడని వాళ్లు కూడా ఈ సినిమా చూసి కచ్చితంగా భయపడతారు అంటూ ఇటీవల నిర్మాత బన్నీ వాసు సినిమా గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసాయి.

Advertisement

హర్రర్ సినిమాల షూటింగ్ సమయంలో దగ్గరుండి చూసిన తానే ఈ సినిమా చూస్తూ నాలుగు సార్లు భయపడ్డానని బన్నీ వాసు తెలిపారు. హర్రర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అలాంటివాళ్లు తప్పకుండా సినిమాకి వస్తే ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు. అయితే ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతుంటారో అలాంటివారు దయచేసి మా సినిమాకు రావద్దు అలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అంత భయంకరంగా ఈ సినిమా ఉండబోతోంది అంటూ నిర్మాత చేసిన వ్యాఖ్యలు కూడా సినిమా పట్ల భారీగానే అంచనాలను పెంచేసాయి. మరి డిసెంబర్ 12వ తేదీ రాబోతున్న ఈ హర్రర్ త్రిల్లర్ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Krithi shetty: ఆ హీరో చాలా కంఫర్టబుల్.. అక్కినేని హీరో పై బేబమ్మ కామెంట్స్!

Related News

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

Big Stories

Advertisement
×