E-Paper
Advertisement

Krithi shetty: ఆ హీరో చాలా కంఫర్టబుల్.. అక్కినేని హీరో పై బేబమ్మ కామెంట్స్!

Krithi shetty: ఆ హీరో చాలా కంఫర్టబుల్.. అక్కినేని హీరో పై బేబమ్మ కామెంట్స్!
Advertisement

Krithi shetty: కృతి శెట్టి పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం తెలుగు సినిమాలలో కాకుండా తమిళ సినిమాలలో నటిస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం తెలుగులో వరుస అవకాశాలను అందుకున్న ఈమె సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక త్వరలోనే కృతి శెట్టి(Krithi Shetty) కార్తీ(Karthi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అన్నగారు వస్తారు(Aanagaru Vostaru) (వా వాతియర్) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

కోలీవుడ్ సినిమాలైనా కలిసొచ్చేనా?

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కృతి శెట్టి తన ఇదివరకు సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలతో కలిసి నటించారు అయితే ఏ హీరోతో సినిమాలు చేయడం కంఫర్ట్ గా ఉంటుందనే ప్రశ్న ఎదురయింది.

నాగచైతన్య చాలా నిజాయితీపరుడు..

Advertisement

ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం చెబుతూ .. నటుడు నాగచైతన్య(Nagachaitanya)తో సినిమాలు చేసేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుందని తెలిపారు. ఆయన ఏ విషయాన్నినైనా చాలా నిజాయితీగా మాట్లాడుతారు ఎలాంటి ఫిల్టర్స్ కూడా ఉండవు. నా ఆలోచనలు కూడా దాదాపు అలాగే ఉంటాయి కనుక ఆయనతో సినిమా షూటింగ్స్ అప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అంటూ కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కృతి శెట్టి అన్నగారు వస్తారు హిట్ ఇచ్చేనా?

Advertisement

ఇక కృతి శెట్టి, నాగచైతన్య కాంబినేషన్లో బంగార్రాజు సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే మరోసారి ఇద్దరు జోడిగా కస్టడీ అనే సినిమాలో నటించారు . అయితే ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. మరి భవిష్యత్తులోనైనా మరోసారి ఈ జోడి వెండితెరపై సందడి చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈమె తమిళంలో నటించిన మొదటి సినిమా డిసెంబర్ 12న రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కృతి శెట్టి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు ఈమె ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో కూడా నటించారు ఈ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కాబోతోంది.

Also Read: Actor Dileep Rape Case: అత్యాచార కేసులో నటుడు దిలీప్ కు ఊరట…8 ఏళ్ల తర్వాత నిర్దోషిగా..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×