E-Paper
Advertisement

Akhanda 2 Release : అఖండ 2 రిలీజ్‌కు బ్రేక్.. 28 కోట్లు కట్టాల్సిందేనా?

Akhanda 2 Release : అఖండ 2 రిలీజ్‌కు బ్రేక్.. 28 కోట్లు కట్టాల్సిందేనా?
Advertisement

Akhanda 2 Release : బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ 2 మూవీ మరి కొన్ని గంటల్లో థియేటర్స్‌లోకి రాబోతుంది. రిలీజ్ డేట్ డిసెంబర్ 5వ తేదీ అయినా.. పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ.. అంటే ఈ రోజు సాయంత్రమే థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే, ఈ సినిమా రిలీజ్‌కి ఓ అడ్డంకి వచ్చి పడింది. రిలీజ్‌పై స్టే విధించాలని హై కోర్టులో పిటిషన్ వేశారు. హై కోర్టులో పిటిషన్ ఎందుకు వేశారు..? ఎవరు వేశారు.? అసలు అఖండ 2 రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమానే ఈ అఖండ 2. అఖండ మూవీ సీక్వెల్‌గా ఇది వస్తుంది. ఈ రోజు ప్రీమియర్స్ వల్ల థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇలాంటి టైంలో మద్రాస్ హై కోర్టులో అఖండ 2 రిలీజ్‌పై స్టే విధించాలి అని పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ వేసింది ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాణ సంస్థ EROS ఇంటర్నేషనల్.

Advertisement

గతంలో EROS ఇంటర్నేషనల్‌ – 14 రీల్స్ మధ్య ఓ బిజినెస్ జరిగింది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. అప్పట్లో EROS ఇంటర్నేషనల్‌కు 28 కోట్లు చెల్లించాలని తీర్పు వచ్చింది. అయితే, కొన్నాళ్లకు 14 రీల్స్ ఇన్ యాక్టివ్ అయిపోయింది. తర్వాత 14 రీల్స్ యాజమాన్యమే.. 14 రీల్స్ ప్లస్ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి.. సినిమాలను రిలీజ్ చేస్తుంది. అలాగే 14 రీల్స్ చేసిన సినిమాలను కూడా ఈ 14 రీల్స్ ప్లస్ వెబ్ సైట్‌లో పెట్టుకుంది.

ఇప్పుడు ఈ 14 రీల్స్ ప్లస్ నిర్మించిన అఖండ 2 సినిమాను తమిళనాడులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో EROS ఇంటర్నేషనల్ మద్రాస్ హై కోర్టు మెట్లు ఎక్కింది. తమకు చెల్లించాల్సిన 28 కోట్లను ఇంట్రెస్ట్‌తో సహా చెల్లించిన తర్వాతే అఖండ 2 రిలీజ్‌ను అనుమతి ఇవ్వాలని, అప్పటి వరకు రిలీజ్‌పై స్టే విధించాలని పిటిషన్‌లో హై కోర్టును కోరింది. అప్పటి 14 రిల్స్ లో ఉన్న వాళ్లే.. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్‌లో ఉన్నారని, తమకు రావాల్సిన 28 కోట్లను వీళ్లే ఇవ్వాలి అంటూ కోర్టుకు తెలిపారు EROS ఇంటర్నేషనల్‌ వాళ్లు.

Advertisement

అలా.. తమిళనాడులో అఖండ 2 రిలీజ్‌కి బ్రేక్ పడినట్టు అయింది. అయితే దీనిపై మద్రాస్ హై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి. ఒక వేళ 14 రీల్స్ ప్లస్ ఆ 28 కోట్లను EROS ఇంటర్నేషనల్‌ కట్టాల్సిందే అని తీర్పు వస్తే మాత్రం తమిళనాడులో అఖండ 2 రిలీజ్‌పై కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పటికే నార్త్ స్టేట్స్‌లో ఈ సినిమాకు చాలా తక్కువ షోలు పడ్డాయి. మొత్తంగా హిందీ బెల్ట్ స్టేట్స్‌లో 40 షోలు మాత్రమే ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో.. తమిళనాడులో కూడా షోలు పడకపోతే… అఖండ 2 ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×