Hebah Patel:హెబ్బా పటేల్…ఈ బ్యూటీ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కుమారి 21F’ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ కొట్టేసిన ఈ భామ తన అందం, నటనతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే హెబ్బా.. తాజాగా నవరాత్రుల సందర్భంగా కొన్ని ఫొటోలు షేర్ చేయగా ఆ ఫొటోలే ఇప్పుడు నెట్టింట్లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
స్టైలిష్ లుక్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్
ఇందులో ఆమె పింక్ కలర్ లెహంగాలో అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది. బ్లౌజ్‌పై ఉన్న గోల్డెన్ వర్క్, చేతుల దగ్గర చేసిన డిజైన్లు ఈ డ్రెస్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయనడంలో సందేహం .మొత్తంగా ఒకవైపు ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపిస్తూనే తన స్టైలిష్ లుక్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది
ఇక ఈ ఫొటోల్లో హెబ్బా వేసిన నగలు కూడా మెయిన్ ఎసెట్ గా నిలిచాయి. పెద్ద పెద్ద చెవిపోగులు, నుదుటిపై పెట్టుకున్న జువెలరీ చేతికి వేసుకున్న గాజులతో ఎక్కువ హడావుడి లేని మేకప్ లేకుండా ఉన్న హెబ్బా లుక్ పూర్తిగా ఫెస్టివల్ వైబ్ ని తీసుకొచ్చింది.ముఖ్యంగా ఎరుపు రంగు బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ ఫొటోల్లో హెబ్బా ఇచ్చిన పోజులు టాప్ నాచ్.
కామెంట్ల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్
సాధారణంగా పండుగలు వచ్చాయంటే హీరోయిన్లు సంప్రదాయ దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తుంటారన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో లెహంగాలు, చీరలు, డిజైనర్ బ్లౌజ్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు హెబ్బా పటేల్ కూడా అలాంటి ట్రెడిషనల్ లుక్‌తో అభిమానుల ముందుకు రావడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక హెబ్బా సినిమాల విషయానికి వస్తే.. ‘కుమారి 21F’ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామరాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హెబ్బా నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘అంధగాడు’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఇక గతేడాది ‘ఈషా’ (2025), ‘మారియో’ (2025), ‘థాంక్యూ డియర్’ (2025), ‘ఓదెల 2’ (2025) సినిమాలతో పలకరించిన ఈ అమ్మడు ఈ ఏడు హరుడు,రేపు ఉదయం 10 గంటలకు అనే సినిమాలతో అలరించింది.ఇక త్వరలో రుద్ర కాల (Rudra Kaala)రామరస (Ramarasa)అనే సినిమాలతో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్
మొత్తంగా హెబ్బా పటేల్ ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా కొత్త ఫొటోషూట్లతో అభిమానులను పలకరిస్తుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే. ఈసారి నవరాత్రుల సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు ఇపుడు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి.
మొత్తానికి, ఎప్పుడూ గ్లామరస్ లుక్స్‌తో కనిపించే హెబ్బా పటేల్.. ఈసారి ట్రెడిషనల్ లుక్ లో కనిపించడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.