E-Paper
Advertisement

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…
Advertisement

ఢిల్లీతో సంబంధాలు మొన్నటిదాకా బాగానే ఉన్నాయి. కానీ చంద్రబాబు ఈ ఇద్దరి రహస్య స్నేహితుల మధ్య చిచ్చు పెట్టాడు. జగన్‌పై ఉన్న అవినీతి కేసులను తిరగడడమే కాదు.. ఈడీని ఉసిగొల్పలాని కేంద్రానికి సూచించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈడీ ఎంట్రీ ఇచ్చింది. జగన్‌ వెంట పడింది. ఇక జగన్‌ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటాడు. తనూ మౌనాన్ని వీడాడు.

ఇప్పటికే కాక్రోచులకు మద్దతు తెలుపుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌.. సీఈసీ నియామకంలో కేంద్ర నిర్ణయాన్ని తాము కూడా సమర్థించడం బ్లండర్‌ మిస్టేక్‌ అని ఒప్పుకున్నాడు. గుడ్డిగా మోడీని అనుసరించినందుకు పశ్చాత్తాపం ప్రకటించాడు. ఎన్నికల వ్యవస్థ మీదే నమ్మకం లేకుండా పోయిందని కడుపులో ఉన్నదంతా కక్కేశాడు.

Advertisement

ఇప్పటిదాకా రహస్యంగా ఎన్డీయేకు సహకరిస్తూ వచ్చిన జగన్.. చంద్రబాబు మధ్యలో దూరి మోడీని రెచ్చగొట్టడం.. ఆయన కూడా రెచ్చిపోవడంతో తనూ రెచ్చిపోయి.. ఇలా ప్రధాన లోపమైన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకంపైనే ఎదురుదాడికి దిగాడు. ప్రతిపక్ష నేత, సీజేఐల ప్రమేయంతోనే సీఈసీని నియమించడం కరెక్టని, ఇలా అధికార పార్టీకే పూర్తి పగ్గాలివ్వడం మూలంగా.. ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని పరోక్షంగా ఎస్ఐఆర్‌ విధానం పూర్తిగా తప్పు అని అర్థం వచ్చేలా కామెంట్‌ చేశాడు.

ఓట్‌ చోరీ నిజమేననే విధంగానే జగన్‌ ఎదురుదాడికి దిగడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల వాడీ వేడీ వాతావరణానికి జగన్‌ ఈ కామెంట్లతో మరింత ఆజ్యం పోశాడు. ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా? అనే తర్జన భర్జన నుంచి బయటపడినట్టే బయటపడినా.. ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇండీ కూటమికి  దగ్గరా కాలేదు.  అందుకే అటూ ఇటూ కాకుండా మధ్యలో చౌరస్తాలో నిలబడి ఉన్నట్టే ఉంది జగన్‌ పొలిటికల్ స్టాండ్‌.

Advertisement

ఈ మధ్య సీపీఐ నేతలు కలిసి ఈ ప్రస్తావన తెచ్చినా.. తన నిర్ణయాన్ని క్లారిటీగా వెలువర్చలేకపోయాడు జగన్‌. షర్మిలా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉండటం, సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాడు. కానీ మారుతున్న రాజకీయ వాతావరణాన్ని బట్టి ఎన్నికలకు ఆరు నెలల ముందు కచ్చితంగా ఏదో ఒక స్టాండ్‌ తీసుకోవాల్సే ఉంటుంది.

ఎన్డీయేతో ఇప్పుడు గ్యాప్‌ పెరిగిన నేపథ్యంలో… ఇండీ కూటమికి అప్పటి వరకు అనుకూల గాలులు వీచినట్టుగా కనిపిస్తే .. లోకల్‌ రాజకీయాలు పక్కన బెట్టి.. జాతీయ రాజకీయాల్లో తను కూడా కీలకంగా ఉండేందుకు ఇండీ కూటమికి జై కొట్టే పరిస్థితులు వచ్చినా రావొచ్చంటున్నారు.

కానీ, ఇప్పటికైతే మోడీతో దూరం కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండీ కూటమితో చెట్టాపట్టాలేసుకు తిరగడం కూడా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

Big Stories

Advertisement
×