E-Paper
Advertisement

Dharmendra -Hema Malini: ధర్మేంద్ర పుట్టినరోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హేమామాలిని!

Dharmendra -Hema Malini: ధర్మేంద్ర పుట్టినరోజు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హేమామాలిని!
Advertisement

Dharmendra -Hema Malini: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) గత రెండు వారాల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ధర్మేంద్ర 89 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇప్పటికీ ధర్మేంద్ర మరణ వార్త నుంచి ఆయన కుటుంబ సభ్యులు బయటపడలేదని తెలుస్తోంది

నాతోనే ఉంటావని తెలుసు..

ధర్మేంద్ర మరణించడంతో ఆయన సతీమణి హేమమాలిని తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తే ఎమోషనల్ అవుతున్నారు. ఇకపోతే నేడు ధర్మేంద్ర పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా హేమామాలిని ధర్మేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ధర్మేంద్రతో కలిసి దిగిన ఫోటోలను హేమామాలిని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ… ధరం జీ..నా ప్రియమైన హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు మమ్మల్ని వదిలి వెళ్లి రెండు వారాలు అవుతుంది.ఈ బాధ నుంచి తిరిగి నెమ్మదిగా నన్ను నేను పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావనే విషయం నాకు తెలుసు.

ఆ క్షణాలు ఎప్పటికీ చెరిగిపోవు..

Advertisement

మేమిద్దరం కలిసి గడిపిన అందమైన క్షణాలు ఎప్పటికీ చెరిగిపోవు.. అలాగే ఆ క్షణాలు నాకు చాలా ఓదార్పును సంతోషాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఇలా మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నందుకు దేవుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఇద్దరూ అమ్మాయిల కోసం నా హృదయంలో నిండిపోయిన ఈ జ్ఞాపకాలు అన్నింటికీ కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకు వచ్చారు. మీ పుట్టిన రోజున మీ వినయం, మంచితనం, మానవత్వం, పట్ల మీకున్న ప్రేమకు దేవుడు మీకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. హ్యాపీ బర్త్ డే డియర్ లవ్ అంటూ ఈమె షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు సెలబ్రిటీలు కూడా ధర్మేంద్రను మరోసారి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.. ఈయన గత రెండు వారాల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్రమైన శ్వాస కోసం సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర కొన్ని రోజులపాటు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ చికిత్స పొందుతూ కాస్త కోలుకున్నారు అయితే ఈయనని ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈయన మరణించిన రెండు వారాలకి తన పుట్టినరోజు రావడంతో హేమామాలిని ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: Telusukada Movie: తెలుసు కదా ఫెయిల్యూర్ అదే కారణం అన్న నీరజ కోన.. రియలైజ్ అయ్యిందా?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×