Redmi Note 15 Pro 4G: ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం షియోమి త్వరలో భారత మార్కెట్‌లోకి రెడ్‌మీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ‘Redmi Note 15 Pro 4G’ పేరుతో రానున్న ఈ మోడల్ తాజాగా యూరోపియన్ రిటైల్ లిస్టింగ్‌లో ప్రత్యక్షమైంది. అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో రాబోతుందనే సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే సూచించింది. ప్రత్యేకంగా 200MP మెయిన్ కెమెరా, 6,500mAh భారీ బ్యాటరీ ఈ మోడల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో ఒక్కసారి చూసేద్దామా!
రెడ్‌మీ నోట్ 15 ప్రో 4G ఫోన్ MediaTek Helio G200 Ultra చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి రానుంది. 5G వెర్షన్‌తో పోలిస్తే ఈ మోడల్‌లో microSD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది స్టోరేజ్‌ను పెంచుకోవాలనుకునే వారికి మంచి ఆప్షన్.
Read Also: శక్తివంతమైన బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ కెమెరా.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60eపై దిమ్మతిరిగే డిస్కౌంట్!
షియోమి చౌకైన ఈ 4G వెర్షన్‌లో కూడా అదే 200MP 1/1.4-ఇంచ్ ప్రైమరీ కెమెరాని అందిస్తోంది. అంటే.. ఫోటోగ్రఫీ లవర్స్‌కు ఇది పర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక డిస్‌ప్లే & బ్యాటరీ విషయానికొస్తే..ఈ ఫోన్‌లో 6.77 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంటుంది. కంటెంట్ స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఇది మంచి అనుభూతిని ఇస్తుంది.
రెడ్‌మీ నోట్ 15 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ 6,500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌ను 4G నెట్‌వర్క్‌పై ఒకే ఛార్జ్‌తో 1-2 రోజులు సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే భారత మార్కెట్‌లో దీని లాంచ్ ధర రూ.17,990 పరిధిలో ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. Redmi Note 15 Pro 5G మోడల్‌తో పోలిస్తే ఇది మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా రానుంది. అయితే దీనికి సంబంధించి షియోమి సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Read Also: వివో ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన సూపర్ సేల్.. అతి తక్కువ ధరకే వివో T4 అల్ట్రా!