E-Paper
Advertisement

Telusukada Movie: తెలుసు కదా ఫెయిల్యూర్ అదే కారణం అన్న నీరజ కోన.. రియలైజ్ అయ్యిందా?

Telusukada Movie: తెలుసు కదా ఫెయిల్యూర్ అదే కారణం అన్న నీరజ కోన.. రియలైజ్ అయ్యిందా?
Advertisement

Telusukada Movie: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నటుడు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత జాక్ తెలుసు కదా వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుసు కదా(Telusukada) సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

తెలుసు కదా అందుకే సక్సెస్ కాలేదు..

ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ రాశి కన్నా, నిధి అగర్వాల్ నటించారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన మొదటిసారి దర్శకురాలిగా మారి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నీరజకోన ఈ సినిమా సక్సెస్ కాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.

క్లైమాక్స్ మార్చి ఉంటే బాగుండేది..

Advertisement

ఈ సందర్భంగా నీరజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సినిమా ఫెయిల్యూర్ కి కారణం అని తెలిపారు ఈ సినిమా మొత్తం హీరో గ్రే షేడ్స్ ఉన్న కుర్రాడిగా కనిపిస్తారు అయితే క్లైమాక్స్ లో అతను మారుతారని అందరూ భావించారు కానీ ఆ క్యారెక్టర్ మారని నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారని ఈ సినిమా ఫెయిల్యూర్ కి అదే ప్రధాన కారణమని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా అడ్వాన్స్డ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని ఇప్పుడు కాకుండా మరి కొన్ని సంవత్సరాలు ఆలస్యంగా విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేదని తెలిపారు.

అడ్వాన్స్డ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

Advertisement

ఇలా అడ్వాన్స్డ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటూ ఈ సినిమా ఫెయిల్యూర్ కి గల కారణాలను తెలిపారు. ప్రస్తుతం తెలుసు కదా సినిమా గురించి నీరజ కోన చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత కాపీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నా సినిమా కథను దొంగలించి నీరజ తెలుసు కదా సినిమాని చేశారు అంటూ ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం కెరియర్ పరంగా తదుపరి సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: HBD Prerna Arora: ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా బర్త్ డే స్పెషల్ ..మరో పాన్ ఇండియా సినిమా ప్రకటన!

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×