Adivi Shesh: సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా, హీరోయిన్గా అడుగు పెట్టేటప్పుడు ప్రత్యేకించి నటన విభాగంలో పూర్తిగా శిక్షణ తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. మరి కొంతమంది అటు డాన్స్ తో మొదట సోషల్ మీడియాలో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరో మాత్రం ఇండస్ట్రీలో కొచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఒక్కసారి కూడా డాన్స్ చేయలేదని.. కానీ తొలిసారి ఒక మూవీ కోసం డాన్స్ చేశాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు అడివి శేష్ (Adivi Shesh). తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆయన తొలిసారి డాన్స్ చేశాను అంటూ చేసిన కామెంట్లకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే..అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు.. ప్రేక్షకులలో అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. మరొకవైపు ఈ సినిమా నుండి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో అడివి శేష్.. తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆయన మాట్లాడుతూ..” నా కెరియర్ లో తొలిసారి నేను డెకాయిట్ సినిమాలో డాన్స్ చేశాను” అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా విషయం గురించి మాట్లాడుతూ..” నాకు జ్వరం వస్తోంది. అయినా సరే ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో జ్వరంతో బాధపడుతూ కూడా ఈవెంట్ కి వచ్చాను.. ఈనెల 21న ఈ సినిమా విడుదల కాబోతోంది” అంటూ తెలిపారు అడివి శేష్.
ALSO READ:Richest Actor’s: ఇండియా టాప్ 8 రిచెస్ట్ హీరోలు వీళ్లే.. టాలీవుడ్ హీరోల స్థానం?
ఇకపోతే డెకాయిట్ సినిమా కోసం తొలిసారి డాన్స్ చేశానని చెప్పడంతో ఇన్ని రోజులు భలే మేనేజ్ చేశావు గురూ.. అయినా ఈ సడన్ ట్విస్ట్ ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అడివి శేష్ తొలిసారి డెకాయిట్ కోసం డాన్స్ చేశానని చెప్పడంతో.. ఆ సినిమాలో తన డాన్స్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో అని చూడడానికి అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
హైదరాబాదులో జన్మించి కాలిఫోర్నియాలోని బర్కలీలో పెరిగిన అడివి శేష్.. సినిమాల మీద ఆసక్తితో 2010లో కర్మ అనే ప్రేమ కథతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాదు ఇదే సినిమాకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. పంజా , బలుపు, బాహుబలి:ది బిగినింగ్ వంటి చిత్రాలలో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దొంగాట, క్షణం, అమీతుమీ, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ : ది సెకండ్ కేసు వంటి చిత్రాలలో నటించి ప్రముఖ నటుడిగా స్థిరపడ్డారు. ప్రస్తుతం డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య రొమాంటిక్ యాక్షన్ లవ్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.