E-Paper
Advertisement

Richest Actor’s: ఇండియా టాప్ 8 రిచెస్ట్ హీరోలు వీళ్లే.. టాలీవుడ్ హీరోల స్థానం?

Richest Actor’s: ఇండియా టాప్ 8 రిచెస్ట్ హీరోలు వీళ్లే.. టాలీవుడ్ హీరోల స్థానం?
Advertisement

Richest Actor’s:మిగతా రంగాలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులను అలరించే ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాల ద్వారా సంపాదిస్తున్నారు.. మరొకవైపు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెడుతూ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇంకొంతమంది సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. సినిమాలతో పాటు బట్టలు, రియల్ ఎస్టేట్, ఆహారం ఇలా పలు వ్యాపార రంగాలలో సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని పెంచుకుంటూ.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ధనవంతుల జాబితాలో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

అలా ఇండియాలో అత్యధికంగా ఆస్తులు కలిగిన టాప్ టెన్ సెలబ్రిటీల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? టాప్ 8 లో టాలీవుడ్ హీరోలు స్థానం సంపాదించుకున్నారా? సంపాదించుకుంటే వారి స్థానం ఎంత ? ఎవరు ఏ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టారు అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

షారుఖ్ ఖాన్:

Advertisement

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ 8లోనే కాదు ఆసియాలోనే అత్యధిక ఆస్తులు కలిగిన సెలబ్రిటీలలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan). రూ.14,490 కోట్ల ఆస్తులతో టాప్ టెన్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు బాలీవుడ్ బాద్ షా.

నాగార్జున:

అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన సినిమాల ద్వారానే కాకుండా ఇతర రంగాలలో పెట్టబడులు పెట్టి బిజీగా మారిపోయారు. తన తండ్రి తదనంతరం అన్నపూర్ణ స్టూడియోను నిర్వహిస్తూ.. మరింత ఆదాయాన్ని పొందుతున్న ఈయన.. ఏకంగా రూ.3500 కోట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.

హృతిక్ రోషన్:

Advertisement

అమ్మాయిల కలల రాకుమారుడుగా బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ పలు రంగాలలో పెట్టుబడులు పెట్టి.. తన ఆదాయాన్ని భారీగా పెంపొందించుకున్నారు. 3,100 కోట్ల ఆస్తులతో మూడవ స్థానంలో నిలిచారు హృతిక్ రోషన్.

సల్మాన్ ఖాన్:

బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ధనవంతుల జాబితాలో చేరడమే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పేరు దక్కించుకున్నారు. 50 ఏళ్ళైనా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. రూ.2930 కోట్ల ఆస్తులతో నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నారు సల్మాన్ ఖాన్.

అక్షయ్ కుమార్:

ఒకవైపు హీరోగా మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్ కుమార్ రూ.2,540 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు.

అమితాబ్ బచ్చన్:

బాలీవుడ్ బిగ్ బి, మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ రూ.1,720 కోట్ల ఆస్తులను కలిగి ఉండి.. ఆరవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయన సినిమాలు, వ్యాపార రంగాలలోనే కాదు పలు యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అంతేకాదు పలు టీవీ షోలలో కూడా చేస్తున్నారు.

చిరంజీవి:

టాలీవుడ్ స్టార్ హీరోగా మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి సినిమాల ద్వారా టీవీ షోల ద్వారా అటు పలు యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు కూడా.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ఏకంగా రూ.1,680 కోట్ల ఆస్తి కలిగి ఉండి ఏడవ స్థానాన్ని దక్కించుకున్నారు.

అమీర్ ఖాన్:

స్టార్ హీరో అమీర్ ఖాన్ భాషతో సంబంధం లేకుండా ఈ మధ్య ఇతర భాష చిత్రాలలో కూడా ఆకట్టుకుంటున్న అమీర్ ఖాన్ 1,630 కోట్ల ప్రాపర్టీతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు.

వీరితోపాటు మరికొంతమంది హీరోలు ఈ జాబితాలో చేరిపోయారు.

ALSO READ:AA22xA6: సైలెంట్ గా షూటింగ్..ఆ నెలే టార్గెట్ అంటున్న మేకర్స్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×