E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అడ్డంగా దొరికిన చక్రధర్.. రాజేశ్వరికి అనుమానం.. పల్లవి నెక్స్ట్ ప్లానేంటి..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి అడ్డంగా దొరికిన చక్రధర్.. రాజేశ్వరికి అనుమానం.. పల్లవి నెక్స్ట్ ప్లానేంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి భానుమతి దగ్గరకొచ్చి కమల్ చేస్తున్న పని నాకు నచ్చట్లేదు అమ్మమ్మ నువ్వైనా ఆ పని మానేయమని చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇంట్లో ఖాళీగా ఉండకుండా వాడు పనిచేస్తున్నాడు అంటే సంతోషంగా ఫీల్ అవ్వాల్సింది పోయి ఇలా వద్దు అంటావేంటి అని భానుమతి రివర్స్లో పల్లవికి గడ్డి పెడుతుంది. కానీ పల్లవి మాత్రం ఇలా చేస్తే ఈ ముసలిది వినదు సెంటిమెంట్తోనే కొట్టాలి అని ఒక పెద్ద స్టోరీ చెప్పేస్తుంది. మా ఆయనకు మీ ఆయన పోలికలు ఉన్నాయని నువ్వు ముద్దుగా మా ఆయనకి కమల్ అని పేరు పెట్టుకున్నావు. ఇలా నాలుగిండ్లకు వెళ్లి కరెంటు పనులు చేసుకుంటూ ఫ్యాన్లు బిగించుకుంటూ ఉంటే తాతయ్య పరువు పోదా అని పల్లవి రెచ్చగొడుతుంది. పల్లవి ప్లాన్ ప్రకారమే భానుమతి వచ్చిందని తెలుసుకొని కమల్ అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాక్షిని చూసిన చక్రధర్ ఆమెకి డబ్బులు ఆఫర్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోవాలని అంటాడు.. నువ్వు నా మీద పగతోనే వచ్చావు నువ్వు ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో నీకు ఇంకా 5 లక్షలు కాదు.. నీ కోసం ఐదు కోట్లు ఇస్తానని అంటాడు. చక్రధర్ ని చూసిన అవని ఇంకొక వంద రూపాయలు ఎక్కువ వేసి ఇస్తాను అని అంటుంది.. నువ్వు నియంతటి నువ్వు మా అమ్మని నా భార్య అని ఒప్పుకోవాలి అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది అని అవని వార్నింగ్ ఇస్తుంది. వీళ్లందరిని చూసిన పల్లవి డబ్బులు ఎందుకు ఆ మీనాక్షికిస్తున్నాడు మా నాన్నకి అ మీనాక్షి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది పల్లవి..

Advertisement

పల్లవి తన పుట్టింటికి వెళ్లి చక్రధర్ ని నువ్వు అవని అమ్మకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నావు ఇంతకీ నీకు ఆమెకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది. ఆవిడకి నాకు ఏ సంబంధం ఉంది.. నువ్వెందుకు ఆవిడకి డబ్బులు ఇచ్చావు. నేను ఇన్ని రోజులు గమనించలేదు.. కానీ మొన్ననే నాకు అనుమానం వచ్చిందినేను ఇన్ని రోజులు గమనించలేదు కానీ మొన్ననే నాకు అనుమానం వచ్చింది. అసలు నువ్వెందుకు ఆమెకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావో చెప్పు డాడ్ అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేశ్వరి ఎందుకిచ్చారు మీరు ఆవిడకి డబ్బులు.. ఈమధ్య మీరు చాలా మారిపోయారు అని అడుగుతుంది.

నీ కూతురికి ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన మీరు ఇప్పుడు తనని సపోర్ట్ చేయకుండా తిడుతున్నారు.. మీరు మారాలని నేను కోరుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే మీరు ఇంతగా మారిపోతారని అస్సలు ఊహించలేదు.. మీకు ఆ డబ్బులు నేను ఎందుకు ఇయ్యాలి అనుకున్నాను అంటే అది నీ కోసమే పల్లవి అని చక్రధర్ మెల్లగా తప్పించుకుంటాడు. నాకోసం మీరు ఎవరు ఆవిడకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి..? ఆమె వల్ల నువ్వు మొన్న అవమాన పడ్డావు.. మరి నిన్ను ఆ ఇంట్లో గౌరవంగా చూడాలని నేను అనుకుంటున్నాను.. మీనాక్షి వల్ల నీకు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను గతి లేని వాల్లే కదా.. కాబట్టే కూతురి ఇంటికి వచ్చి పడ్డారు అందుకే డబ్బులు ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుందని అనుకున్నాను అని చక్రధర్ అంటాడు.

Advertisement

ఇక ఇంటికి రాగానే ఇంటి ఓనర్ వచ్చి అద్దె కట్టాలని అడుగుతాడు.. డబ్బులు ఓనర్ కి ఇవ్వడానికి అవని వెళ్తుంది. అయితే అతను మీ ఇంటికి ఎవరో కొత్తగా వచ్చినట్లు ఉన్నారు మొన్న బట్టలు ఆరేస్తుంటే చూశాను. ఆవిడ ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉంటారు. ఈరోజుల్లో ఇద్దరు ముగ్గురికి ఇల్లు ఇస్తున్నారు మీరు బాగా బతికిన కుటుంబం కాబట్టి మీకు ఇల్లు ఇచ్చాను. పడితే వాళ్ళు వచ్చి ఉండడానికి ఇదేమి సత్రం కాదు కదా అని ఓనర్ అంటాడు. ఇంకొకరు కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకొక 2000 ఎక్స్ట్రా ఇచ్చి నాకు 12000 మొత్తం రెంటు ఇవ్వండి అని అడుగుతాడు. అవని వెంటనే 12000 మీకు ట్రాన్స్ఫర్ చేశాను చూడండి అని అంటుంది.

ఇందాకటి నుంచి చూస్తున్నాను ఇంటి ఓనర్ ఉన్నాడని నేను ఏమీ మాట్లాడలేదు. ఇంటికి అద్దె కట్టాల్సింది నా భార్య అవని ఒక్కటేనా.. మీకు ఎవరికీ బాధ్యతలు లేవా మీరు సంపాదిస్తున్నారు కదా అని అక్షయ్ అంటాడు. అవునన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ గా నిజమే కార్లు టీవీలు కొనడానికి డబ్బులు వస్తాయి.. కానీ ఇంటి అద్దె ఇవ్వడానికి డబ్బులు రావేంటి అని కమల్ అందరూ సమానంగా ఇవ్వాలి అని అంటాడు. అదే 12000 కదా ఇదిగో నా 4000 అని కమలిస్తాడు ఇక శ్రీకర్ని కూడా ఇవ్వమని అడిగితే.. శ్రీయ అవని వాళ్ళ అమ్మ ఉంటుంది కదా వాళ్ళ అమ్మ వల్లే కదా 2000 ఎక్స్ట్రా అయింది నువ్వు 3000 మాత్రమే ఇవ్వు అని అంటుంది..

ఇప్పుడు ఆవిడ ఉండడానికి 2000 ఎక్స్ట్రా అయ్యాయి.. ఇక తినడానికి తిండి మందులు హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివన్నీ చాలానే అవుతాయి కదా ఇంట్లో ఆవిడ ఉండడం అవసరమా అని అడుగుతుంది శ్రీయ.. తన మాటలు విన్న పార్వతి నువ్వు ఇలా మారిపోతామని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది.. అందరూ బాధ్యతగా ఉంటేనే కుటుంబం ముందుకు సాగుతుంది అని అక్షయ్ అంటాడు.. అక్షయ్ అవని దగ్గరికి వచ్చి.. మీ అమ్మగారు భోజనం చేశారా అని అడుగుతాడు.

Also Read : బాలును తిట్టిన ప్రభావతి.. మనోజ్ మీనా షాక్.. ఇది కదా అసలైన ట్విస్ట్..

నేను రేపు వచ్చేటప్పుడు బీపీ మిషన్ తీసుకొని వస్తాను. రోజు నువ్వు ఇంట్లోనే మీ అమ్మకు బీపీ చెక్ చెయ్యొచ్చు అని అక్షయ్ అంటాడు. నిన్నటి వరకు మీరు నా గురించి అసలు పట్టించుకోనే లేదు. కానీ ఇవాళ నా గురించి మాత్రమే కాదు మా అమ్మ గురించి కూడా మీరు పట్టించుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అండి అని అక్షయ్ అంటుంది. మీ చేత బిజినెస్ చేయించాలనే కోరికతోనే నేను ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాను. అంతేకానీ ఇలా అందరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు అని అవని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×