E-Paper
Advertisement

అడివి శేష్ అలాంటి సమస్యతో బాధపడుతున్నారా.. విస్తుపోయే నిజాలు తెరపైకి!

అడివి శేష్ అలాంటి సమస్యతో బాధపడుతున్నారా.. విస్తుపోయే నిజాలు తెరపైకి!
Advertisement

Adivi shesh:సినిమా సెలబ్రిటీలు తెరపైకి ఎంతో అందంగా, హుందాగా కనిపించినప్పటికీ తెరవెనుక నిజ జీవితంలో వారు పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడితే మరికొంతమంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇకపోతే ఇప్పటివరకు స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అడివి శేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా లుక్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు దక్కించుకున్నారు. అలాంటి అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న అడివి శేష్ తన ఆరోగ్య సమస్య గురించి తాజాగా బయటపెట్టినట్లు తెలుస్తోంది. మరి అడివి శేష్ ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

అలాంటి సమస్యతో బాధపడుతున్న అడివి శేష్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల డెకాయిట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ మాట్లాడుతూ తనకున్న తీవ్రమైన యాంగ్జైటీ సమస్య గురించి చెప్పుకొచ్చారు.” షూటింగ్ మొదలయ్యే ముందు నాకు చాలా భయంగా ఉంటుంది. ఎంతో గందరగోళంగా అనిపిస్తుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి నేను అరోమా థెరపీ తో పాటు కళ్ళపై ఐస్ పెట్టుకోవడం వంటి పద్ధతులు పాటిస్తున్నాను. ఒక ఎమోషనల్ సీన్ కోసం అయితే ముందు రోజు రాత్రి నుంచే నా మనసును నేను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది” అంటూ తనకున్న సమస్య గురించి బయటపెట్టారు అడివి శేష్. ప్రస్తుతం అడివి శేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు నెటిజన్లు తన పని పట్ల ఆయనకున్న అంకితభావం ఎంతో గొప్పది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తన సమస్యను దాచుకోకుండా బయటకు చెప్పడం ద్వారా అది తప్పు కాదని నిరూపించిన శేష్ నిజమైన హీరో అనిపించుకుంటున్నారు.

Advertisement

ALSO READ:హాట్ సమ్మర్ లో కూల్ చిత్రాలు.. ఏప్రిల్ మొదటి వారంలో అలరించనున్న మూవీస్!

ఏప్రిల్ 10న రాబోతున్న డెకాయిట్..

అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ సినిమా విషయానికి వస్తే.. డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహించారు . మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఏప్రిల్ 10వ తేదీ అంటే ఈపాటికి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సింది కానీ అటు చిత్ర బృందం పెద్దగా ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఎటువంటి పనులు చేయకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి ప్రమోషన్ ఎంత పెద్ద ఎత్తున జరిగితే ఆ సినిమా అంత రీచ్ ఉంటుందని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇకనైనా చిత్ర బృందం కాస్త హుషారు పడి సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు మరి ఏప్రిల్ 10వ తేదీన రాబోతున్న ఈ డెకాయిట్ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×