E-Paper
Advertisement

మంగళవారం పుట్టిన వారిని పోరాటయోధులు అంటారట ఎందుకో తెలుసా..?

మంగళవారం పుట్టిన వారిని పోరాటయోధులు అంటారట ఎందుకో తెలుసా..?
Advertisement

Warriors: మంగళవారం పుట్టిన వారిని పోరాటయోధులు అంటారట. ఎందుకో తెలుసా..? అసలు మంగళవారం పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఏ రంగంలో స్థిరపడతారు. ఏ వయసులో వారికి టర్నింగ్‌ పాయింట్‌ వస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం పుట్టిన వారిపై కుజుడి ప్రభావం ఉంటుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం జన్మించిన వారి స్వభావం, వృత్తి మరియు అదృష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: మంగళవారం పుట్టిన వారు  సహజంగానే అత్యంత ధైర్యవంతులు. ఏ పనినైనా వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో పూర్తి  చేస్తారట. వీరికి పట్టుదల ఎక్కువ. ఎంతటి కష్టమైనా తట్టుకుని నిలబడే శక్తి వీరిలో ఉంటుందట. వీరికి కోపం త్వరగా వస్తుందట కానీ అదే స్థాయిలో వెంటనే తగ్గిపోతుందట. మనసులో కల్మషం ఉండదట. అయితే తమ కోపాన్ని నియంత్రించుకోవడం వీరికి జీవితంలో చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. వీరు స్పష్టమైన మాటలు మాట్లాడతారట. అబద్ధాలను అస్సలు సహించరట.

మంగళవారం పుట్టిన వారు ఏ రంగంలో స్థిరపడతారు?: మంగళవారం పుట్టిన వారి మీద కుజుడి ప్రభావం ఉంటుందట అందుకే వీరికి సాహసం, సాంకేతికత రంగాల్లో చాలా బాగా రాణిస్తారట. వీరు  సైన్యం (Military), పోలీస్, ఫైర్ సర్వీసెస్ లేదా ఏ రకమైన రక్షణ విభాగాలలో అద్భుతంగా రాణిస్తారట. అలాగే ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ  ముఖ్యంగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో వీరికి మంచి పట్టు లభిస్తుందట. ఇంకా సర్జన్లు (Surgeons) లేదా అత్యవసర చికిత్స అందించే విభాగాల్లో వీరు సక్సెస్ అవుతారట. అలాగే అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన క్రీడలలో వీరి పేరు ప్రఖ్యాతులు పొందుతారట. భూమి, భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి బాగా కలిసి వస్తుందట.

Advertisement

మంగళవారం పుట్టిన వారికి జీవితంలో అదృష్ట విషయాలు: మంగళవారం పుట్టిన వారికి సాధారణంగా 28 ఏళ్ల వయస్సు తర్వాత జీవితంలో స్థిరత్వం, ఆర్థిక పురోగతి మొదలవుతాయట. 32 నుంచి 40 ఏళ్ల మధ్య కాలం వీరికి అత్యంత అదృష్టవంతమైన కాలంగా పరిగణించబడుతుందట. వీరికి ఎరుపు, పింక్‌ రంగులు కలిసి వస్తాయట. ఈ రంగుల దుస్తులు  ధరించడం వల్ల వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. ఇక 9, 1, 8 వీరికి కలిసి వచ్చే సంఖ్యలట.

మంగళవారం పుట్టిన వారు పాటించాల్సిన విషయాలు: మంగళవారం జన్మించిన వారు కోపాన్ని తగ్గించుకోవడం ద్వారా సగం సమస్యలను అధిగమిస్తారట. అలాగే  ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజ దోషాలు తొలగి, జీవితంలో ప్రశాంతత, విజయం లభిస్తాయట. అలాగే వీలైనప్పుడు ఎరుపు రంగు వస్తువులు లేదా కందిపప్పు వంటివి దానం చేయడం శుభప్రదమట. ఇక మంగళవారం పుట్టిన వారు పోరాట యోధులట. వీరు తమ జీవితంలో వచ్చే అడ్డంకులను తమ పట్టుదలతో అధిగమించి, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సోమవారం పుట్టిన వారికి జీవితంలో 25 ఏళ్లకే ఏం జరుగుతుందో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×