E-Paper
Advertisement

అక్షయ్ కుమార్ కూతురికీ వేదింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు!

అక్షయ్ కుమార్ కూతురికీ వేదింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు!
Advertisement

Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ ఒకరు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్న అక్షయ్ కుమార్ కూతురు ఆన్లైన్ వేధింపులకు గురి అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ఓ కార్యక్రమంలో తెలియజేశారు. గత ఏడాది సైబర్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన తన కూతురుకు ఎదురైన చేదు అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. తన కుమార్తె ఆన్లైన్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులతో వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో అవతలి వ్యక్తి తనని పరిచయం చేసుకొని వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు.

నీ న్యూడ్ ఫోటోలు పంపిస్తావా?

తన కూతురితో మంచి పరిచయం ఏర్పరచుకున్న తర్వాత, తనకు మెసేజ్ చేశారని అయితే అమ్మాయి అనే విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి నీ న్యూడ్ ఫోటోలు పంపిస్తావా ?అంటూ అభ్యంతరకరమైన మెసేజ్ లు చేశారని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఇలా తన కూతురికి ఇలాంటి మెసేజ్ లు రావడంతో వెంటనే ఆ ప్రమేతమైన తన కూతురు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పిందని, దీంతో సైబర్ క్రైమ్ కు అక్షయ్ కుమార్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

నిందితుడిని గుర్తించిన పోలీసులు..

Advertisement

అక్షయ్ కుమార్ ఫిర్యాదు చేయటంతో సైబర్ క్రైమ్ పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు అక్షయ్ కుమార్ కూతురిపట్ల వేధింపులకు పాల్పడినటువంటి వ్యక్తిని మహారాష్ట్ర సైబర్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మహారాష్ట్ర పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితుడు గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈయన గతంలో కూడా ఇలాగే ప్రవర్తించారా? ఈయనపై కేసులు నమోదు అయ్యాయా అనే విషయాలపై విచారిస్తున్నారు. డిజిటల్ ట్రాకింగ్ ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

వారంలో ఒకరోజు సైబర్ తరగతిలో..

Advertisement

ఈ విధంగా స్టార్ హీరో అయినటువంటి అక్షయ్ కుమార్ కూతురికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో ఈయన గతంలో ఇదే అంశం గురించి మాట్లాడుతూ.. పిల్లలకు సైబర్ భద్రత అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం కోసం పాఠశాలలలో వారంలో ఒకరోజు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ కి సంబంధించిన తరగతులను నిర్వహించాలని  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ను కోరిన సంగతి తెలిసిందే. ఇలా పిల్లలకు సైబర్ మోసాల పట్ల అవగాహన ఉన్నప్పుడే సైబర్ వలలో పడకుండ ఉంటారని అక్షయ్ కుమార్ తెలిపారు. ఇక అక్షయ్ కుమార్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్టులలో అక్షయ్ కుమార్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ఈయన చివరిగా మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో కనిపించి సందడి చేశారు.

Also Read: కొత్త విడుదల తేదీ ప్రకటించిన మెగాకోడలు సతీ లీలావతి..

 

Related News

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×