E-Paper
Advertisement

కొత్త విడుదల తేదీ ప్రకటించిన మెగాకోడలు సతీ లీలావతి..

కొత్త విడుదల తేదీ ప్రకటించిన మెగాకోడలు సతీ లీలావతి..
Advertisement

Sathi Leelavathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొట్టమొదటి చిత్రం సతీ లీలావతి(Sathi Leelavathi). ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా మే 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. నిజానికి ఈ సినిమా మార్చి ఆరో తేదీ విడుదల కాబోతుందని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది.

భార్య భర్తల గొడవల నేపథ్యం..

ఇలా మార్చి 6న వాయిదా పడిన ఈ సినిమా మే 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాతినేని సత్య దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వి.కె. నరేష్, గణేష్ సప్తగిరి వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ వంటివి సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత లావణ్య మొదటి సినిమా..

Advertisement

ఈ సినిమాలో లీలావతి పాత్రలో నటి లావణ్య నటించారు. ఈమెకు భర్తగా దేవ్ నటించారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి మెగా కోడలు మొదటి సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె ఉత్తరాది రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల సినిమాలలో నటిస్తూ తెలుగింటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

అందాల రాక్షసి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించిన ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలలో నటించారు .ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో 2022 నవంబర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు గత ఏడాది ఒక కుమారుడు జన్మించారు . ఈ చిన్నారికి వాయువ్ తేజ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ పై అడివి శేష్ క్లారిటీ…మెగా వారసుడి రాక అప్పుడేనా?

Related News

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×