Hero Chandrahas: తెలుగు సినీ నటుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు, హీరో చంద్రహాస్ నటిస్తున్న తాజా చిత్రం “బరాబర్ ప్రేమిస్తా”.. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చకు తెరతీశాడు. ఆ పాట ఇప్పుడు వివాదానికి దారితీసింది. పాటలో హిందూ దేవుళ్లను, ముఖ్యంగా శివుడిని కించపరిచేలా పదజాలం ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ పాట చిత్రీకరణ మరియు సాహిత్యం ఉన్నాయని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. పాట పాడిన నటుడు, అలాగే చిత్రయూనిట్ పై చర్యలు తీసుకోవాలని, వివాదాస్పదంగా ఉన్న ఆ పాటను వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ కేసు పై స్పందించిన పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాటపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆల్రెడీ ఈ హీరో ఒక సినిమా చేశాడు అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ హీరో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అంతే కాదు మరోవైపు ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి.. ఇక ఈ సినిమాలో ఈయన పాడిన ‘గుంజి గుంజి’ పాటపై విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఈ పాటలో బూతులు ఉన్నాయంటూ కొందరు పాటని డిలీట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు.. ఇప్పటికే పలు ఏరియాలో ఈ పాటపై కేసులు పెట్టారు. కానీ ఈ కేసుల గురించి హీరో ఇప్పటికీ స్పందించలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా.. ఈ మూవీ ఫిబ్రవరి 6 న థియేటర్లలోకి రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా హీరో చంద్రహాస్ ఓ పాటను పాడారు. అయితే ఆ పాటలో ఉన్న బూతు పదాలని సినిమాలో తొలగించారు.. కానీ హీరో మాత్రం అలానే పాడడంతో అడ్డంగా ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. దీంతో తాజాగా అతనిపై ఓ టీవీ ఛానల్ కు సంబంధించిన ఓ జర్నలిస్టు కూడా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సినిమా పై వ్యతిరేకత కూడా మొదలైంది. పోలీస్ కేసు నమోదు అవ్వడం పై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు..