E-Paper
Advertisement

Feel Good Movie OTT: తండ్రికి దూరమయ్యే కొడుకు… భార్యను కాపాడలేక … ఎమోషన్ అంటే ఇదే మావా

Feel Good Movie OTT: తండ్రికి దూరమయ్యే కొడుకు… భార్యను కాపాడలేక … ఎమోషన్ అంటే ఇదే మావా
Advertisement

Feel Good Movie OTT : ఒక గొప్ప హార్ట్ బ్రేకింగ్ స్టోరీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. చూస్తుంటే కళ్లు తడిసిపోతాయి. ఫ్యామిలీతో చూస్తే మరింత ఏడుపు వస్తుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది.  ఈ స్టోరీ 1980లో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుంది. ఇది టర్కిష్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో ఈ సినిమాను చూడచ్చు అంటే

మై ఫాదర్ అండ్ మై సన్ (My Father and My Son) 2005లో వచ్చిన అత్యంత ఆదరణ పొందిన టర్కిష్ డ్రామా మూవీ ఇది. ఈ చిత్రానికి చాగన్ ఇర్మాక్ దర్శకత్వం వహించారు. ఇది ఆయన డైరెక్ట్ చేసిన బెస్ట్ ఎమోషనల్ ఫిల్మ్‌లలో ఒకటి. ఇందులో ఫిక్రెట్ కుష్కాన్ (సదిక్), ఏగే తన్మాన్ (డెనిజ్), చెటిన్ టెకిందోర్ (హుస్సేన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2005 నవంబర్ 18న టర్కీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. అలాగే మీరు ఈ మూవీని ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో YouTubeలో కూడా చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సాదిక్ అనే యువకుడు తన తండ్రి హుస్సేన్ మాట వినకుండా, ఊరు వదిలి సిటీకి వెళ్ళిపోతాడు. అక్కడ జర్నలిజం చదువుతూ రాజకీయాల్లో పాల్గొంటాడు. ఆ సమయంలో దేశంలో జరిగిన గొడవల వల్ల సాదిక్ భార్య చనిపోతుంది. కానీ అప్పటికే అతనికి డెనిజ్ అనే కొడుకు పుడతాడు. రాజకీయ కారణాల వల్ల జైలుకు వెళ్లిన సాదిక్, అక్కడ పడ్డ దెబ్బల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకున్న సాదిక్, తన తర్వాత కొడుకు అనాథ కాకూడదని ఒక నిర్ణయం తీసుకుంటాడు. పదేళ్ల తర్వాత తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు.

మొదట్లో కోపంతో ఉన్న తండ్రి హుస్సేన్, మనవన్ని చూసి మెల్లగా కరుగుతాడు. సాదిక్ తన అనారోగ్యం గురించి ఇంట్లో చెప్పకుండా, తన తండ్రికి తన కొడుకుని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరకు సాదిక్ చనిపోయినప్పుడు, పంతాల కంటే ప్రేమే గొప్పదని హుస్సేన్ గ్రహిస్తాడు. కళ్ళను తడి పెట్టించే క్లైమాక్స్‌తో, మనవడిని తన సొంత కొడుకులా గుండెలకు హత్తుకోవడంతో ఈ సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also :  భర్త రాత్రి పూట ఉద్యోగం చేస్తే.. భార్య పగటిపూట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×