E-Paper
Advertisement

WPL 2026 Final: ఇవాళే WPL 2026 ఫైన‌ల్స్..4 ఏళ్ల ఢిల్లీ క‌ల నెర‌వేరుతుందా? వ‌ర్షం ప‌డితే ఎలా, ఎవ‌రికి లాభం

WPL 2026 Final: ఇవాళే WPL 2026 ఫైన‌ల్స్..4 ఏళ్ల ఢిల్లీ క‌ల నెర‌వేరుతుందా? వ‌ర్షం ప‌డితే ఎలా, ఎవ‌రికి లాభం
Advertisement

WPL 2026 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 ) తుది దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల ( Royal Challengers Bengaluru Women vs Delhi Capitals Women) మధ్య ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరు జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. వడోదర లోని బీసీఏ స్టేడియం ( BCA Stadium, Kotambi, Vadodara ) వేదికగా ఈ రసవత్తర ఫైట్ జరగనుంది. సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో మ్యాచ్ షురూ అవుతుంది. ఏడు గంటలకు టాస్ ప్రక్రియ ఉండే ఛాన్స్ ఉంది. రెండు జట్లు బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారన్న దానిపైన సర్వత్ర ఆసక్తి నెలపొంది. ఈ ఫైనల్ మ్యాచ్ జియో హాట్ స్టార్ వేదికగా అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఉచితంగా చూడవచ్చు.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

ఫైనల్ మ్యాచ్ కు వర్షం పడితే ఎలా?

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( WPL 2026 ) భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ వడోదర వేదికగా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వర్షం పడితే పరిస్థితి ఏంటని ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే రిజర్వుడే ఉంటుంది. ఫిబ్రవరి 6 వ తేదీన ఈ మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇంక రేపు కూడా వర్షం పడి మ్యాచ్ కు అంతరాయం కలిగితే, అప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అవుతుంది. ఎందుకంటే నేరుగా ఫైనల్ కు వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అన్న సంగతి తెలిసిందే. పాయింట్స్ ప్రకారం చూసుకున్నా కూడా బెంగళూరు లీడ్ లో ఉంది. దీంతో కచ్చితంగా బెంగళూరు విజయం సాధిస్తుంది. ఇక ఎలాంటి వర్షం లేకుండా మ్యాచ్ జరిగితే మాత్రం ఢిల్లీ ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తోంది. 2023 నుంచి ఫైనల్ దాకా వచ్చి ఓడిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో ముందుకు వెళ్తోంది.

ఆర్సీబీ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధాన(సి), జార్జియా వోల్, రిచా ఘోష్(w), రాధా యాదవ్, నదీన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, ప్రేమిక్ హేమల, ప్రేమిక్ హేమల.

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్: లిజెల్ లీ(w), షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(సి), మారిజానే కాప్, చినెల్లె హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ, అలనా కింగ్, తానియా భాటియా, ప్రద్గతి స్మిల్టన్, ప్రద్గతి స్మిల్టన్, ప్రద్గతి స్మిల్టన్.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×